Jr NTR Fans Press Meet: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (MLA Daggubati Prasad) చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఎన్టీఆర్‌ని తిడుతూ ఆయన ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన సినిమా చూడద్దంటూ తారక్‌ని అసభ్యపదజాలంతో దూషించారు. ఆయన తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో టీడీపీ అది తన వాయిస్ కాదని, ఎవరో ఎడిట్ చేసి పెట్టారని వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్
ఈ మేరకు తారక్ అభిమానులు (Jr NTR Fans Press Meet) హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం నడిబోడ్డున క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఛలో అనంతపూర్ పేరుతో నిరసనలు చేపడతమని హెచ్చరించారు. అంతేకాదు సదరు ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే మాటలు చాలా దారుణంగా ఉన్నాయని, ఆయన తల్లిని అవమానించే విధంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆయనలా మేము కూడా కూడా మాట్లాడోచ్చు.
ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
కానీ ఎన్టీఆర్ అంటేనే సంస్కారం. అలాంటి హీరో అభిమానులుగా తామే అలాంటి దుర్భాషలాడము. అది మా హీరోకు నచ్చదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి.. ఆయనపై ఎలాంటి దుషణలు చేయలేకపోతున్నామన్నారు. ఇంట్లో ఆడవాళ్లపై అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ, ఎమ్మెల్యే ప్రసాద్ మాత్రం బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రెండు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఆల్ ఆండియా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు భారీ ఎత్తున్న నిరసనలు తెలియజేస్తామని వారు హెచ్చిరించారు. కాగా వార్ 2 రిలీజ్ సందర్భంగా అనంతపూర్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పార్టీ కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా చూడొద్దని బెదిరించారు.
అంతేకాదు వార్ 2 బదులుగా కూలీ మూవీ చూడాలని సూచించారు. రాష్ట్రంలో వార్ 2 చిత్రాన్ని ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిపై దుర్భాషలాడాడు. తారక్‌ను తిడుతూ.. మంత్రి నారా లోకేష్‌పై కూడా ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దే అని అభిమానులు నొక్కి చెబుతున్నారు. ఆయనకు నందమూరి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన దిగి వచ్చారు. మొదట మౌనంగా ఉన్న ఆయన ఆ తర్వాత బయటకు వచ్చి ఆ ఆడియో కాల్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా ఎవరో తనపై కుట్ర చేశారంటూ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకునేలా మాట్లాడుతూ ఆయన క్షమాపణలు చెప్పారు.
Also Read: Naga Vamsi: మాస్ జాతర వాయిదా.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇస్తూ నాగవంశీ ట్వీట్