Salam Anali From War 2: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్ 2 (War 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పై పెద్దగా ప్రభావం చూపించకపోయిన మెల్లమెల్లగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య భారీ పోటీ ఏర్పడిన సంగతి తెలిసిందే.
ట్రెండింగ్ అవుతున్న సలాం అనాలి సాంగ్..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఇద్దరి హీరోల నటన, డాన్స్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా సలాం అనాలే (Salam Anali)పాటను విడుదల చేశారు అయితే కేవలం ఈ సాంగ్ ప్రోమో విడుదల చేస్తూ ఫుల్ సాంగ్ థియేటర్లోనే చూడాలని మేకర్స్ వెల్లడించారు. తాజాగా దునియా సలాం అనాలే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్లోకి వచ్చింది. ఇక ఈ పాటలో ఎవరు అద్భుతంగా డాన్స్ చేశారనే విషయంపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
పోటీపడి డాన్స్ చేసిన హీరోలు..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంత అద్భుతమైన డాన్సరో చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో డాన్స్ అంటే ఇతర హీరోలు కూడా వెనకడుగు వేస్తారు అలాంటిది ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తూ హృతిక్ రోషన్ డాన్స్ చేశారంటూ పలువురు ఈ పాట పై కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా సినిమా విడుదలైన వారం రోజులకే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడం ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ చాలా స్టైలిష్ గా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తీసిపోకుండా హృతిక్ రోషన్ కు పోటీ ఇస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇక ఈ పాటకు ప్రీతం సంగీతం అందించగా కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్, యాజిన్ నిజార్ ఎంతో అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ కు వార్2 సినిమా మొదటి బాలీవుడ్ సినిమా కావటం విశేషం. ఇలా మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. వార్ 2 సినిమా యష్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు.
Also Read: Ragile Ragile Song: రగిలే రగిలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!