Jr NTR Fans Filed Complaint to Sajjanar: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన మార్పింగ్ ఫోటోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేస్తూ ఫోటోలను మార్ఫ్ చేసి షేర్ చేస్తున్నారు.ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవి మరింత మితిమిరపోతున్నాయి. ట్రోలర్స్ మరింత దిగజారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెన్నారు. అంతేకాదు ఇటీవల ఏపీలోని ఎన్టీఆర్ గుండుతో ఉన్నట్టుగా ఎడిట్ చేసి ఫ్లెక్సీ పెట్టారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురై వారిపై చర్యలకు దిగారు.
ఈ విషయమై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కు తాజాగా ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నందిపాటి మురళి తాజాగా సీపీ సజ్జనార్ని కలిసి పిటిషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఫోటోలు పెడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన పోస్టులు, ఫోటోలు తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కామన్గా చూస్తూనే ఉంటాం. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ అభిమానులు దాడి చేసుకుంటుంటారు. మొదట ఇది ఎక్కువ తమిళ్, తెలుగు హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండేది. కానీ, ఇప్పుడు ఇది తెలుగు హీరో ఫ్యాన్స్ మధ్య కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ నుంచి ఈ ఫ్యాన్ మరి ఎక్కువైంది.
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో ఈ ఇద్దరి హీరోల పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరి సమానమైన ప్రాధాన్యత ఇచ్చాడు. స్క్రిన్ స్పేస్ కూడా సమానంగా ఉంది. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ మాత్రం మా హీరోనే ఇందులో లీడ్ రోల్ చేశారంటూ నందమూరి, మెగా ఫ్యాన్స్ తరచూ సోషల్ మీడియాలో తరచ వాదించుకుంటారు. మీ హీరో ఆర్ఆర్ఆర్లో సైడ్ క్యారెక్టర్ చేశాడని, ఈసారి మంచి రోల్ ఇప్పిస్తామంటూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలో హీరో మూవీ అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి ఈ ఫ్యాన్ వార్ మళ్లీ మొదలవుతుంది. అయితే మరింత రెచ్చగోట్టలే ఫోటోలు మార్ఫ్ చేస్తున్నారు. ఆ మధ్య ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోని వైరల్ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఓల్డ్ లుక్లో ముడతల మొహంతో ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు.