E-Paper
Advertisement

Jr NTR Home: ఇంట్లో పార్టీ.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూశారా? కళ్లు చెదిరిపోవాల్సిందే..

Jr NTR Home: ఇంట్లో పార్టీ.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూశారా? కళ్లు చెదిరిపోవాల్సిందే..

Jr. NTR New Designed Home: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. తారక్ డెబ్యూ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 14న వార్ 2 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ట్రైలర్ విడుదల చేసింది. నిన్న రిలీజైన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ బీస్ట్ లుక్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలే అన్నట్టు గా ఉంది. షర్ట్ లెస్ సీన్ తారక్ లుక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తోంది. 

కొత్త డిజైనింగ్ మెరిసిపోతున్న తారక్ ఇల్లు

ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో వార్ 2 టీం సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సింపుల్ విందు పార్టీ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ అందరిని ఆకట్టుకున్న విషయమేంటంటే.. తారక్ ఇల్లు. సరికొత్త ఇంటిరియల్ డిజైనింగ్ ఇల్లంత చాలా క్లాసీ, లగ్జరీగా కనిపించింది. అయితే ఇది కొత్త ఇల్లు ఏం కాదు. తన పాత ఇంటినే రీ డిజైన్ చేయించాడట. తనకు చెందిన జూబ్లిహిల్స్ ఇంటిలో ఇటీవల రెనోవేషన్ చేయించాడు తారక్. మొన్నటి వరకు అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుండేది. ఇటీవల ఇది పూర్తయ్యింది. సెలబ్రిటీ ఇంటీరియల్ డిజైనర్స్ తో ప్రత్యేకంగా తన అభిరుచి తగ్గట్టుగా తారక్ డిజైన్ చేయించుకున్నాడు. ఈ ఫోటోల్లో వాల్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్త అమర్చిన ఈ వాల్ ఫ్రేమ్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ ఇలా ప్రతిదీ తారక్ చాలా అందంగా, కొత్తగా డిజైన్ చేయించాడు. ఈ కొత్త ఇంటీరియల్ చూస్తుంటే తారక్ రెనోవేషన్ కి గట్టిగానే ఖర్చు చేశాడనిపిస్తోంది.  

డ్రాగన్, దేవర 2 లతో బిజీ

కాగా వార్ 2 తో పాటు తారక్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీతో (ప్రచారంలో ఉన్న టైటిల్) బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల అతడు లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రాగన్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ అడవుల్లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ చేస్తూ మరోవైపు వార్ 2 షూటింగ్ కానిచ్చేసాడు ఎన్టీఆర్. వార్ 2, డ్రాగన్ తో పాటు దేవర 2 కూడా ఉంది. వీటితో పాటు తివిక్రమ్ తో ఓ మైథలాజికల్ మూవీ, అలాగే తమిళ దర్శకుడి నెల్సన్ తో ఓ భారీ సినిమాకు కమిటయ్యాడు. ఇలా భారీ చిత్రాల లైనప్ ఎన్టీఆర్ ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. చూస్తుంటే మరో ఐదారేళ్లు తారక్ ఫుల్ బిజీ బిజీగా ఉంటానడంలో సందేహం లేదు. కాబట్టి నందమూరి ఫ్యాన్స్ మరో ఆరేళ్ల పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ సినిమాల జాతరే ఉండబోతుంది.

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×