Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి ఇప్పుడు వరుస విషాదాలు ఎదురవుతున్నాయి అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. ఇటీవల ఆయన భుజానికి దెబ్బ తగలగా.. వైద్యుల సమక్షంలో సర్జరీ చేయించుకొని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఫిజియోథెరపీ తీసుకుంటూ తనను తాను మళ్ళీ కం బ్యాక్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో.. ఆయనకు మరో మానసిక దెబ్బ తగిలింది. తాను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న బఘీరా ఇక లేడు అనే వార్తను ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క బఘీరా కన్నుమూసింది. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి పట్ల ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన పెంపుడు కుక్కతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి అంటూ సలహా ఇస్తున్నారు.
బఘీరా.. నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగు పెట్టావు. నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా కలిసిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు హృదయాలలో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు మిగిల్చిన ప్రేమ మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకొని, నాతో పాటు నడిచి, ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని మరింత అందంగా మార్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు.. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నువ్వు ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ప్రేమించబడ్డావు. అలాగే ఎప్పటికీ నాలో ఇమిడిపోయి ఉంటావు” అంటూ ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క పై ఉన్న ప్రేమను పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ALSO READ:నీచంగా ప్రవర్తించాడు.. పీరియడ్స్ విషయంలో సిగ్గుపడేలా చేశాడు – అనుపమ ఎమోషనల్
ఇకపోతే ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటోలలో ఆయన తన పెంపుడు కుక్క బఘీరా తో కలిసి గడిపిన క్షణాలు , దానిని ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. చివరిగా బఘీరా జ్ఞాపకార్థం దాని సమాధి వద్ద ఒక చిన్న మొక్కను నాటిన దృశ్యం కూడా అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. బఘీరా లేకపోయినా దాని స్థానంలో నాటిన ఈ పచ్చని చెట్టు జీవితాంతం బఘీరాను గుర్తు చేస్తూ ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియపరుస్తున్నారు.