E-Paper
Advertisement

జాంబీలను పని మనుషులుగా వాడుకునే జనాలు… ఇలాంటి హర్రర్ కామెడీని ఎక్కడా చూసుండరు సామీ

జాంబీలను పని మనుషులుగా వాడుకునే జనాలు… ఇలాంటి హర్రర్ కామెడీని ఎక్కడా చూసుండరు సామీ
Advertisement

Zombie Horror Comedy: జోంబీ సినిమాలు అంటే సాధారణంగా భయం, రక్తపాతం, ప్రాణాల కోసం పరుగులు గుర్తుకొస్తాయి. కానీ అదే జోంబీలను చూసి ప్రేక్షకుడు భయపడకుండా నవ్వుకుంటే ఎలా ఉంటుంది ? అలాంటి అరుదైన కథతో తెరకెక్కిన బ్రిటిష్ హారర్ కామెడీ చిత్రమే ‘షాన్ ఆఫ్ ది డెడ్’ (Shaun of the Dead). హారర్‌కు కామెడీని జోడించి, ప్రతి సన్నివేశాన్ని వినోదంగా మార్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. నేటికీ జోంబీ సినిమాల గురించి మాట్లాడితే ఈ చిత్రం తప్పకుండా గుర్తుకొస్తుంది. మరి ఇందులో అంత ప్రత్యేకత ఏమిటి ? ఎందుకు ఇప్పటికీ ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది ? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

షాన్ లండన్‌లో ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో పనిచేసే మామూలు యువకుడు. జీవితంలో పెద్దగా లక్ష్యాలు లేకుండా తన స్నేహితుడు ఎడ్‌తో కలిసి రోజంతా కాలక్షేపం చేస్తూ గడుపుతుంటాడు. పని అయిపోయాక పబ్‌కు వెళ్లడం, ఇంటికి వచ్చి వీడియో గేమ్స్ ఆడటం… ఇదే వాళ్ళ రొటీన్. ఇంతలో నగరం మొత్తం ఒక వింత వైరస్ బారిన పడుతుంది. ఒక్కొక్కరుగా మనుషులు జోంబీలుగా మారిపోతుంటారు. వీధులన్నీ జోంబీలతో నిండిపోతాయి.

Advertisement

కానీ షాన్, ఎడ్ మాత్రం తమ పనుల్లో మునిగిపోవడంతో చుట్టూ ఏం జరుగుతోందో కూడా గమనించరు. మరుసటి రోజు ఇంటి బయట జోంబీలు తిరుగుతున్నా కూడా ఏమీ తెలియనట్లు పాలు, వార్తాపత్రిక కొనుక్కొని తిరిగి ఇంటికి వచ్చేయడం సినిమాలో నవ్వులు పంచుతుంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసుకునే సరికి మాత్రం వాళ్ల జీవితమే తలకిందులవుతుంది. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కాపాడుకునేందుకు ఇద్దరూ ప్రయత్నాలు మొదలు పెడతారు.

అయితే మిగతా జోంబీ సినిమాల్లా ఆయుధాలు పట్టుకుని పోరాడకుండా, ఇంట్లో కనిపించిన వస్తువులతోనే వాటిని ఎదుర్కోవడం మరింత వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా పాత సంగీత రికార్డులను జోంబీలపై విసురుతూ, “ఇది మంచి రికార్డు… దీన్ని వేయొద్దు”, “ఇది పనికిరాదు… దీన్ని విసిరేయ్” అంటూ మాట్లాడుకునే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే జోంబీల మధ్య నుంచి తప్పించుకోవడానికి తామూ జోంబీల్లా నటిస్తూ, నడిచే ఎపిసోడ్ ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Advertisement

చివరికి షాన్ తన కుటుంబాన్ని కాపాడగలిగాడా ? జోంబీ వైరస్ ఎలా అదుపులోకి వచ్చింది ? అతని ప్రాణ స్నేహితుడు ఎడ్‌కు ఏమైంది ? జోంబీలు పూర్తిగా అంతమయ్యాయా ? లేక మరో ఊహించని ముగింపు ఎదురైందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. భయపెట్టాల్సిన జోంబీలనే నవ్వించే పాత్రలుగా మార్చడం, హారర్‌ను సరదాగా చూపించడం, స్నేహం, కుటుంబ బంధాలను కూడా కథలో సహజంగా మిళితం చేయడం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘షాన్ ఆఫ్ ది డెడ్’ సినిమాలో సైమన్ పెగ్, నిక్ ఫ్రాస్ట్, కేట్ ఆష్‌ఫీల్డ్, లూసీ డేవిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడ్గార్ రైట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. హారర్ సినిమాలు ఇష్టమైనా, భయపడకుండా నవ్వుకుంటూ చూడాలనుకునేవారికి ఈ మూవీ అద్భుతమైన ఆప్షన్. ఒక్కసారి సినిమా మొదలుపెడితే చివరి వరకు నవ్వు ఆపుకోవడం కష్టమే.

Read Also: 187 రోజుల పెళ్లి డీల్… రివేంజ్ కోసం శత్రువు కూతురుతో ఇదేం అగ్రిమెంట్ మావా ?

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×