E-Paper
Advertisement

కిమ్స్ హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. సర్జరీ తర్వాత తొలి ఫోటో!

కిమ్స్ హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. సర్జరీ తర్వాత తొలి ఫోటో!
Advertisement

Jr NTR:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్(NTR ) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి ఈయన భుజానికి ఆగస్టు 12వ తేదీన సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో నిష్ణాతులైన వైద్యుల సమక్షంలో సర్జరీ జరిగింది. నేడు కిమ్స్ హాస్పిటల్ నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు పంచుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఎన్టీఆర్..

సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నుండి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ వార్త అభిమానులకు భారీ ఊరటనిచ్చింది. ఆయన భుజానికి విజయవంతంగా సర్జరీ పూర్తి కావడంతో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఎన్టీఆర్ ను డిశ్చార్జ్ చేశారు. ఇకపోతే తనకు ఆపరేషన్ చేసిన వైద్యులతో కలసి ఆయన ఒక ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చేతి కట్టుతో ఎన్టీఆర్ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Advertisement

ALSO READ:బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?

అసలేం జరిగిందంటే?

గత కొన్ని వారాల క్రితం ఎన్టీఆర్ భుజానికి గాయమైందని, ప్రముఖ వైద్యుల సమక్షంలో చికిత్స నిర్వహించగా.. 8 వారాలపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని తెలిపారట. అయితే నొప్పి తీవ్రతరం కావడంతో ఎట్టకేలకు సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో ఆయన సర్జరీ చేయించుకున్నారు.. ఇకపోతే ఇప్పటినుంచి దాదాపు మూడు నెలల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట..

డ్రాగన్ మూవీ షూటింగ్ వాయిదాపై కొత్త వార్త..

Advertisement

ఎన్టీఆర్ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యులు చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. డ్రాగన్ సినిమా మరింత ఆలస్యం అవుతుందని, షూటింగ్ పూర్తి అయ్యేసరికి 2027 అవుతుందని, 2028లో డ్రాగన్ సినిమా ఆడియన్స్ ముందుకి వస్తుంది అని ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చూస్తున్నారట. మరి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుండి కొత్త షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. సెప్టెంబర్ 4వ వారంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Related News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

Big Stories

Advertisement
×