E-Paper
Advertisement

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?
Advertisement

Bigg boss AgniPariksha 2: సాధారణంగా రియాలిటీ షోలు అంటే ఎక్కువగా సెలబ్రిటీలకే మొదటి ప్రయారిటీ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా నిలిచిన బిగ్ బాస్ (Bigg Boss) లో మాత్రం గత కొన్ని సీజన్లుగా సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ దూసుకుపోతున్నారు. సామాన్యులు బిగ్బాస్ సీజన్ 10 కూడా ఏకంగా టైటిల్ విజేతలుగా నిలుస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అలా గతంలో సామాన్యులు గా వచ్చిన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), కళ్యాణ్ పడాలా(Kalyan padala) లు ఇప్పటికే బిగ్ బాస్ విజేతలుగా టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో తెలుగులో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10లో కూడా సామాన్యులకు కంటెస్టెంట్ గా అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అగ్నిపరీక్ష సీజన్ 2కి 25వేల దరఖాస్తులు..

ముఖ్యంగా సామాన్యులతో వచ్చిన గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాలనుకుంటున్న సామాన్యులకు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పించారు నిర్వాహకులు. అయితే ఈ పిలుపుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా 25 వేల మంది దరఖాస్తులు చేసుకోగా.. వాటిని పరిశీలించి అందులో 70 మందిని అగ్నిపరీక్ష కోసం సెలెక్ట్ చేశారు. ఇక్కడ కొన్ని పరీక్షలు , టాస్కులు పెట్టి వీరిలో కొందరికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా వెళ్లే అవకాశాన్ని కల్పించనున్నారు.

75 మందిలో 15 మంది ఫైనల్..

Advertisement

నిజానికి గత ఏడాది వచ్చిన సీజన్ 9 సమయంలో కూడా అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహించగా.. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఈసారి కూడా అగ్నిపరీక్ష సీజన్ 2 ను చాలా గ్రాండ్గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే యాంకర్ శ్రీముఖి (Sreemukhi) హోస్ట్ గా, బిందు మాధవి (Bindhu madhavi), అభిజిత్ (Abhijeet), నవదీప్ (Navdeep ) లు జడ్జిలుగా ఆగస్టు 15వ తేదీ నుంచి అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే జియో హాట్ స్టార్ వేదిక విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం సామాన్యుల నుంచి 25 వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. అందులో కేవలం 70 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ 70 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసి, ఆ 15 మంది నుంచి ఆరుగురిని మాత్రం బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి పంపించబోతున్నారు.

also read:ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగని ‘ డ్రాగన్’ మూవీ షూటింగ్!

ఆ 15 మంది జాబితా ఇదే..

Advertisement

ఇక ఆగస్టు 15 నుండి జియో హాట్ స్టార్, ఇటు స్టార్ మా వేదికలుగా ప్రసారం కాబోతున్న అగ్ని పరీక్ష షోలో 15 మందిని ఫైనల్ చేయగా.. ఆ 15 మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిలో మిత్ లేష్, రోహిత్ నాయుడు, రాజకుమారి డయానా, ఆర్జే చరణ్, యాంకర్ ప్రియా, శాలిని పటేల్, భాగీ తాళ్లూరి, శ్రష్టి వ్యాకరణి, అమన్ మసూద్, మిస్ అపూర్వ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, హేమంత్, దీపక్ సేనాపతి, నవరసాలు మామ ఆర్కె ఇలా 15 మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ లిస్టు నిజమా? కాదా? లేక లీకులు మొదలయ్యాయా ? అనేది తెలియాలి అంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఎండింగ్ వరకు ఎదురు చూడాల్సిందే . మరిహౌస్ లోకి వెళ్లే ఆ ఆరుగురు ఎవరో తెలియాలి అంటే హోస్ట్ నాగార్జున ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇంకా సెప్టెంబర్ 6వ తేదీన బిగ్ బాస్ దశావతారం ప్రారంభం కాబోతోంది.

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

Big Stories

Advertisement
×