E-Paper
Advertisement

బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఏఐ కెమెరాలు, గూగుల్ జెమిని ఫీచర్లతో ఆ తేదీన లాంచ్!

బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఏఐ కెమెరాలు, గూగుల్ జెమిని ఫీచర్లతో ఆ తేదీన లాంచ్!
Advertisement

Boltt Ace 5G and Evo Phones: ఇప్పటివరకు స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లతో అలరించిన ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ Boltt.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. తమ తొలి స్మార్ట్‌ఫోన్ల శ్రేణిలో భాగంగా Ace 5G, Evo అనే రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండింటిలో Ace 5G కాస్త ప్రీమియం మోడల్ కాగా.. Evo బడ్జెట్ శ్రేణి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వస్తోంది.

కళ్లు చెదిరే డిజైన్లు, ఆకర్షణీయమైన కలర్స్:

విడుదలకు ముందే కంపెనీ ఈ ఫోన్ల లుక్, డిజైన్లను రివీల్ చేసింది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. Ace 5G మోడల్ క్లాసీ రెడ్ రంగులో రానుండగా.. Evo ఫోన్ లైట్ బ్లూ రంగులో లభించనుంది. డిజైన్ పరంగా రెండింటికీ వ్యత్యాసం ఉంది. Ace 5G వెనుక వైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెక్టాంగ్యులర్ కెమెరా మోడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇక Evo మోడల్‌లో రెండు కెమెరాలతో చదరపు ఆకారంలో (స్క్వేర్) కెమెరా ఐలాండ్ ఉంటుంది. రెండింటిలోనూ పంచ్ హోల్ కటౌట్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. Ace 5G ఫోన్ 9.49 మిమీ మందంతో కాస్త గ్రాండ్‌గా కనిపిస్తుంది.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. iPhone 18 Proతో పాటు పాత ఫోన్ల ధరలూ పెరుగుతున్నాయా?

అద్భుతమైన కెమెరా స్పెసిఫికేషన్లు:

ఫొటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా బోల్ట్ వీటి కెమెరాలను తీర్చిదిద్దింది. ఏస్ 5జీ ఫోన్‌లో f/1.8 అపెర్చర్‌తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. మరోవైపు ఎవో మోడల్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. సహజమైన స్కిన్ టోన్ ఇచ్చేందుకు ఈ ఫ్రంట్ కెమెరాలలో ‘రియల్ టోన్’ సపోర్ట్‌ను కూడా జోడించారు.

గూగుల్ ఏఐ, జెమిని హంగులు:

Advertisement

ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ గూగుల్ ఏఐ ఫీచర్లే. తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఫొటోలు తీసేందుకు ఏఐ నైట్ మోడ్, సీన్ ఆప్టిమైజేషన్, షేక్ అయిన ఫొటోలను సైతం క్లియర్ చేసే ‘ఫేస్ అన్ బ్లర్’ ఫీచర్లను ఇందులో చేర్చారు. వీటితో పాటు స్క్రీన్ పై ఉన్న దేన్నైనా క్షణాల్లో సెర్చ్ చేయడానికి ‘సర్కిల్ టు సెర్చ్’, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ కోసం ‘గూగుల్ లెన్స్’ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ జెమిని సపోర్ట్‌తో రోజువారీ పనులు, సంభాషణలు మరింత సులభంగా మారుతాయి. ప్రాసెసర్, బ్యాటరీ, ధర వంటి వివరాలను ఆగస్టు 25న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

Also Read: ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!

Tags

Related News

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. Truecaller Scam Checkerతో మోసాలపై ముందే అలర్ట్!

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

Big Stories

Advertisement
×