Jyothi Krishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) నిర్మాణంలో.. ఆయన వారసుడు ఏ. ఎం. జ్యోతి కృష్ణ(AM Jyothi Krishna) దర్శకత్వం వహించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం గురించి అలాగే హైపర్ ఆది (Hyper Aadi)తో ఈ సినిమాకి ఉన్న సంబంధం గురించి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా థాంక్స్ కార్డ్స్ లో హైపర్ ఆదికి థాంక్స్ వేయడం గురించి కూడా జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చారు.
వీరమల్లుతో హైపర్ ఆదికి ఉన్న సంబంధం ఇదే – జ్యోతి కృష్ణ
ఇదే విషయంపై డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. జబర్దస్త్ (Jabardasth ) లో ఆది స్కిట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఆయన డైలాగ్స్ కూడా భారీ పంచ్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ డైలాగ్స్ నన్ను కూడా ఆకర్షించాయి. వాస్తవానికి ‘రూల్స్ వైన్యం’ అనే సినిమా చేస్తున్నప్పుడు ఆదితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే.. హరిహర వీరమల్లు సినిమాలో నక్క – పవన్ కళ్యాణ్ మాట్లాడే సీన్ డైలాగ్ కోసం ఆదిని సంప్రదించాను. ఆయన ఆ డైలాగ్ రాశారు. అక్కడ కాస్త కామెడీ ఉంటే బాగుంటుంది అనుకొని.. ఆదితో అక్కడ డైలాగ్ రాయించాను. ఆ సీన్ కి హైపర్ ఆది అందించిన డైలాగ్స్ వల్ల ఆ సీన్ బాగా పేలింది. కాస్త తెలంగాణ యాసలో కూడా పాడాల్సి వచ్చింది అంటూ చెప్పారు.అందుకే ఆదికి థాంక్స్ కార్డులో థాంక్స్ చెప్పామని” తెలిపారు.
వీరమల్లులో చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది – జ్యోతి కృష్ణ.
ఆయనతో పాటు చాలామంది కాంట్రిబ్యూషన్ ఈ సినిమాలో ఉందని, వారందరికీ కూడా థాంక్స్ కార్డ్స్ వేసాము అని జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే జబర్దస్త్ లో హైపర్ ఆది డైలాగ్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో హైపర్ ఆదికి అవకాశం ఇచ్చినట్లు డైరెక్టర్ స్పష్టం చేశారు.
త్రివిక్రమ్ వల్లే ఈ సినిమా చేశాను – జ్యోతి కృష్ణ
అలాగే త్రివిక్రమ్ (Trivikram ) కి కూడా స్పెషల్ థాంక్స్ కార్డ్స్ వేయడం వెనుక అసలు విషయంపై మాట్లాడుతూ..” ఈ సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం చాలా ఉంది. నిజానికి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ సినిమా మొదలు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. నన్ను త్రివిక్రమ్ తో టచ్ లో ఉండాలని చెప్పారు. నేను అనుకున్న లైన్ తీసుకెళ్లి, త్రివిక్రమ్ కి చెబితే అది ఆయనకు నచ్చింది. వెంటనే పవన్ కళ్యాణ్ తో”జ్యోతి కృష్ణ రెడీగా ఉన్నాడు.. సినిమా చేయొచ్చు” అని చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నాతో చెప్పారు.
వీరమల్లులో త్రివిక్రమ్ ప్రమేయం చాలా ఉంది – జ్యోతి కృష్ణ
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు కాబట్టి ఆయన షూటింగ్ కి హాజరయ్యే వాళ్ళు. సినిమాలో ప్రతి సీన్ ఆయన దగ్గరుండి మరీ వీక్షించారు. అవసరమైనచోట జోడించి, అనవసరమైన చోట ఎడిట్ చేయాలని చెప్పి సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటూ త్రివిక్రమ్ ప్రమేయం గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ వెల్లడించారు.
also read:Ashwin Kumar: మహావతార్ సక్సెస్..ఆఖరికి భార్య నగలు కూడా తాకట్టు పెట్టా అంటూ డైరెక్టర్ ఎమోషనల్!
#LokeshKanagaraj Recent Confirm ✅ #LCU – Web Series
– We are planning to make a web series based on the character of #AgentTina. Another director is going to direct it.
– Let's start expanding this as #BENZ starts to succeed.
pic.twitter.com/2Flf12RD6U— Movie Tamil (@MovieTamil4) August 5, 2025