Shruti Hassan: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా శృతిహాసన్(Sruti Hassan) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లు కావడంతో ఈమెపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏకంగా ఐరన్ లెగ్ అంటూ విమర్శలు కూడా చేశారు. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం శృతిహాసన్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన ఈమెకు ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా శృతిహాసన్ పేరు మారుమోగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.
ఈ మూడు సినిమాలు ప్రత్యేకం…
ఇలా ఒకానొక సమయంలో ఏమాత్రం తీరికలేకుండా ఎంతో బిజీగా గడిపిన శృతిహాసన్ తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలను కాస్త తగ్గించారు. ఇక ప్రస్తుతం ఈమె తిరిగి వరస సినిమాలతో బిజీ అవుతున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ(Coolie) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శృతిహాసన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను…
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్లో తనకు బాగా నచ్చిన మూడు పాత్రల గురించి ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేశారు. తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలలో కూలీ సినిమాలోని తన పాత్ర చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. అలాగే త్రీ సినిమాలోని తన పాత్ర కూడా చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక ఈ రెండు సినిమాల కంటే కూడా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన శ్రీమంతుడు(Srimanthudu) సినిమాలోని తన పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో అద్భుతంగా నచ్చిందని షూటింగ్ సమయంలో నా పాత్రలో నటిస్తూ ప్రతిక్షణం ఎంజాయ్ చేశానని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలియజేశారు.
చారుశీల పాత్ర…
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా 2015 ఆగస్టు 7 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చారుశీల పాత్రలో శృతిహాసన్ ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా అటు మహేష్ బాబు కెరియర్ లో కూడా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, శృతిహాసన్ కాంబినేషన్లో ఇప్పటివరకు మరో సినిమా రాలేదని చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత కొరటాలతో మరోసారి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేసి మరో హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Rashmika: విజయ్ దేవరకొండతో వివాదం.. రష్మికతో డాన్సులు.. ఏదో తేడాగా ఉందే?