E-Paper
Advertisement

ఆడిషన్ పేరుతో రెస్టారెంట్‌కు పిలిచి.. డ్రెస్ విప్పమంటూ దారుణం!

ఆడిషన్ పేరుతో రెస్టారెంట్‌కు పిలిచి.. డ్రెస్ విప్పమంటూ దారుణం!
Advertisement

Kangana Sharma:సినీ ఇండస్ట్రీ..ఇక్కడ వెలుగులెన్నో ..చీకట్లు అంతకు మించి. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని, రాత్రికి రాత్రే స్టార్లను చేస్తామని చెప్పి అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వారిక్కడ కోకొల్లలు. ఇదే క్రమంలో నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నాను బాబోయ్ అంటూ బోరుమంటుంది బోల్డ్ బ్యూటీ, నటి కంగనా శర్మ.ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏమందో ఒకసారి చూసేద్దాం.

ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా శర్మ.. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజ్ ‘హేట్ స్టోరీ 2’ ఆడిషన్ సమయంలో జరిగిన సంఘటనను బయటపెట్టింది. ఓ క్యాస్టింగ్ ఏజెంట్ ఆడిషన్ పేరుతో తనను సంప్రదించి, ఆ తర్వాత ఒక రెస్టారెంట్‌కు రమ్మన్నాడని చెప్పింది.

Advertisement

“సినిమాలో బోల్డ్ క్యారెక్టర్, ఇంటీమేట్ సీన్స్ ఉంటాయి, నీకు ఓకేనా?” అని అతడు అడిగితే.. “నటిగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని చెప్పానని చెప్పుకొచ్చింది.

ఎంత బోల్డో నాకు ఇప్పుడే తెలియాలి

దాంతో అతడు .. “నువ్వు ఎంత బోల్డో నాకు ఇప్పుడే తెలియాలి, ఈ రెస్టారెంట్‌లోనే నీ ప్యాంటీ విప్పి చూపించు” అని అడిగేశాడని వాపోయింది . అతడి మాటలకు షాక్ అయిన కంగనా, అప్పటికప్పుడు అక్కడే అతడికి గట్టిగా బుద్ధి చెప్పి రచ్చ చేశానని జరిగిన విషయం బయటపెట్టింది.

Advertisement

దాంతో బయపడిపోయిన ఆ ఏజెంట్ “నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో చూడటానికే అలా ప్రాంక్ చేశా” అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడని కంగనా గుర్తుచేసుకుంది.

ఎన్‌సీసీ క్యాడెట్ నుంచి గ్లామర్ క్వీన్ వరకు..

కంగనా శర్మ విషయానికి వస్తే హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఈ భామ చిన్నతనంలో ఇండియన్ ఆర్మీలో చేరాలని కలలు కని ఎన్‌సీసీ శిక్షణ కూడా తీసుకుందట. ఇక కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశాక మోడలింగ్ వైపు అడుగులు వేయడం, ఆ తర్వాత 2014లో ‘మిస్ మ్యాగ్జిమ్’ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి పాపులర్ అయిపోవడం చక చకా జరిగిపోయాయట.

ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే 2016లో ‘గ్రేట్ గ్రాండ్ మస్తి’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘తూ సూరజ్ మై సాంజే, పియాజీ’ వంటి హిట్ సీరియళ్లు, ‘మోనా హోమ్ డెలివరీ’, ‘ది క్యాసినో’, ‘బిచ్ విల్ బి బ్యాక్’ వంటి క్రేజీ వెబ్ సిరీస్‌లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కూడా. ఇక పలు సూపర్ హిట్ హిందీ, పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి సత్తా చాటడం విశేషం .

 ఒంటరి తల్లిగా పోరాటం

ఇక పెళ్లి విషయానికి వస్తే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2019లో యోగేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కంగనా. కానీ ఆ సంతోషం కొద్ది రోజులే నిలిచింది. యోగేష్ తన మునుపటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడని, గర్భవతిగా ఉన్న సమయంలో శారీరకంగా, మానసికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. పాప పుట్టిన తర్వాత తమను పట్టించుకోకుండా వదిలేయడంతో, ప్రస్తుతం ఒక సింగిల్ మదర్‌గా తన బిడ్డ బాధ్యతలను చూసుకుంటూ ఒంటరిగా పోరాటం చేస్తోంది.

also read :బోయపాటి-అఖిల్.. ఈ రిస్క్ అవసరమా అయ్యగారూ ?

ఏది ఏమైనా అటు కెరీర్ లోనూ , ఇటు జీవితంలోనూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడకుండా జీవితాన్ని ముందుకు సాగిస్తున్న కంగనాని మెచ్చుకొని తీరాల్సిందే!

Tags

Related News

బోయపాటి-అఖిల్.. ఈ రిస్క్ అవసరమా అయ్యగారూ ?

ఇక సెలవు.. ముగిసిన షావుకారు జానకి అంత్యక్రియలు!

బాస్ చేతిలో ఆయుధం.. ‘విశ్వంభర’పై అంచనాలు డబుల్!

చిరూకి ‘స్పిరిట్’ టీమ్ స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

ప్యారడైజ్‌లో అసలేం జరుగుతోంది?

తమ్ముడి విష్.. అన్నయ్య ఎమోషనల్ రిప్లై.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!

2 ఇళ్లల్లోనే మొత్తం షూటింగ్.. బడ్జెట్ మాత్రం బారెడు.. కలెక్షన్స్ ఎంత?

Big Stories

Advertisement
×