E-Paper
Advertisement

బోయపాటి-అఖిల్.. ఈ రిస్క్ అవసరమా అయ్యగారూ ?

బోయపాటి-అఖిల్.. ఈ రిస్క్ అవసరమా అయ్యగారూ ?
Advertisement

Akhil  with Boyapati:ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అక్కినేని అయ్యగారికి ఎట్టకేలకి లెనిన్ రూపంలో ఒక సాలిడ్ పడింది.అయితే ఇది మాస్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ మంచి ఎమోషన్స్ ని పట్టుకొని సేఫ్ గా ల్యాండ్ చేశాడు డైరెక్టర్ మురళి కృష్ణ. దీంతో ఇక వచ్చే సినిమా కూడా మరీ మాస్ జానర్ కాకుండా ఇలా ఏదైనా సింపుల్ గానే లాగించేస్తాడు అనుకున్నారంతా.కానీ ఇపుడు వినిపిస్తున్న టాక్ చూస్తుంటే మళ్ళీ అయ్యగారు ఎప్పటిలాగే పాత బాటలోనే నడుస్తున్నాడా అన్న అనుమానాలు రైజ్ అవుతున్నాయి.

మాస్ లుక్ లో అయ్యగారు 

అసలు ఈ చర్చకు అసలు కారణం అఖిల్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూలుక్.అవును … గుబురు గడ్డం, మీసం, కొత్త హెయిర్‌స్టైల్‌తో పాటు చెవికి పోగు పెట్టుకుని అఖిల్ రగ్గడ్ అవతారంలో కనిపించడమే. ఇంతకు ముందు క్లాస్ గా కనిపించిన అఖిల్‌కి, ఈ లుక్‌కి చాలా తేడా ఉంది మరి.ఈ కొత్త మేకోవర్ చూసిన నెటిజన్లు అఖిల్ ఇక క్లాస్ లవ్ స్టోరీలు పక్కన పెట్టి మాస్ బాట పడుతున్నారంటూ అప్పుడే కామెంట్లు మొదలెట్టేశారు కూడా.

బోయపాటితో జత కడుతున్నాడా ?

Advertisement

ఇక ఇదే సమయంలో అఖిల్ మాస్ కి కేరాఫ్ అయిన బోయపాటి శ్రీను తో జత కడుతున్నాడు అన్న వార్త ఇపుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ కాంబినేషన్ నిజంగానే కుదిరి సరిగ్గా ల్యాండ్ అయితే అఖిల్ కెరీర్‌లో ఇది చాలా బెస్ట్ ఫిలిమ్ అవుతుందని చెప్పకతప్పదు.

కానీ అదే సమయంలో బోయపాటికి అఖిల్ ని ఎలా చూపించాలో అర్థం కాక మరో వినయ విదేయ రామ తీస్తేనే అఖిల్ కెరీర్ కి సమస్య . ఎందుకంటే చకోర పక్షిలా ఎదురు చూసిన అఖిల్ లెనిన్ తో ఫామ్ లోకి వచ్చాడు. మరి అలాంటి ఈ సమయంలో మాస్ , యాక్షన్ అంటూ ట్రాక్ మారిస్తే ఏం జరుగుతుందో అని అక్కినేని ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్రశ్న.

Advertisement

also read :400 మిలియన్ వ్యూస్ టార్గెట్.. శేఖర్ వైరస్ నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఇవే!

అంచనాలాని అందుకుంటారా …లేక బోల్తా పడతారా

నిజానికి బోయపాటి అంటేనే భారీ యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్. అలాంటి మాస్ డైరెక్టర్ చేతిలో అఖిల్ పడితే స్క్రీన్‌పై రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు కాని అది అన్నీ సరిగ్గా కుదిరితేనే..లేకపోతే ఏం జరుగుతుందో స్కంద, వినయ విదేయ రామల విషయంలో ప్రూవ్ అయింది. చూడాలి మరి అంచనాలాని అందుకుంటారా …లేక బోల్తా పడతారా !

Tags

Related News

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×