E-Paper
Advertisement

రేవంత్ రెడ్డితో భజ్జీ ..కేటీఆర్‌తో కుండ చికెన్.. అసలు మ్యాటర్ చెప్పేసిన అంజిమామ !

రేవంత్ రెడ్డితో భజ్జీ ..కేటీఆర్‌తో కుండ చికెన్.. అసలు మ్యాటర్ చెప్పేసిన అంజిమామ !
Advertisement

Anji Mama About KTR :  మై విలేజ్ షోతో బాగా పాపులర్ అయిన అంజి మామ ప్రస్తుతం ఆ షో నుండి బయటికి వచ్చి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే.ఇక ఇదిలా ఉండగా తాజాగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికరమైన సంఘటలని పంచుకుంటున్నాడు.ఇక ఇదే క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజిమామ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌తో తనకు ఉన్న పరిచయాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

కుండ చికెన్ షూటింగ్ కథ

ముఖ్యంగా అంజిమామ చెప్పిన విషయాల్లో కుండ చికెన్ షూటింగ్ కథ క్రేజీగా ఉంది. సాధారణంగా ఒక వీడియో షూట్ గంటలో పూర్తవుతుందని అనుకుంటాం. కానీ తాము చేసిన కుండ చికెన్ వీడియో కోసం దాదాపు ఏడు గంటలు సమయం కేటాయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు అంజిమామ . మధ్యలో బ్రేక్ తీసుకోవడం, మళ్లీ షూటింగ్ మొదలుపెట్టడం, వంట పూర్తి చేయడం ఇలా మొత్తం సమయం గడిచిపోయిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు. చివరికి కుండలో వేసిన చికెన్‌ను షూట్ కోసం మాత్రమే కాకుండా అందరూ కలిసి తిన్నామని నవ్వుతూ చెప్పేశాడు అంజి మామ.

కేటీఆర్‌తో తన పరిచయం

Advertisement

ఇక కేటీఆర్‌తో తన పరిచయం గురించి కూడా అంజిమామ మాట్లాడారు. మై విలేజ్ షో టీమ్‌తో కలిసి ఉన్న సందర్భాల్లో కేటీఆర్‌ను కలిసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. తాము చేసే పల్లెటూరి కంటెంట్‌ను కేటీఆర్ కూడా ప్రోత్సహించారని ఆయన చెప్పుకొచ్చారు.ఇక జగిత్యాల జిల్లాలోని తమ ఊరు అయిన లంబాడిపల్లి ని రెవిన్యూ డివిజన్ గా చేయమని అడిగామని,అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తామని చెప్పారని చెప్పుకొచ్చాడు.అయితే అధికారంలోకి రాకపోవడంతో అది అలాగే ఉండిపోయిందని వాపోయాడు.

రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో

ఇక రేవంత్ రెడ్డితో భజ్జీ తిన్న సందర్భం గుర్తుచేసుకున్నాడు అంజి మామ. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో తనను, గంగవ్వను కలవాలని అనుకున్నారని అంజిమామ గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో గంగవ్వ, తాను కలిసి రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పారు. అక్కడ కలిసి భజ్జీ తిన్న సందర్భాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు అంజిమామ.

Advertisement

అంతేకాదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పాలన విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయన కష్టపడుతున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు
అంజిమామ .

ఆసక్తి పెంచుతున్న అంజిమామ  మాటలు

ఒకవైపు రాజకీయంగా రేవంత్ రెడ్డి, మరోవైపు కేటీఆర్.. ఇద్దరితోనూ తనకు పరిచయం ఉండటం గురించి అంజిమామ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక మై విలేజ్ షో ద్వారా తనకు వచ్చిన గుర్తింపు, డబ్బు గురించి కూడా అంజిమామ ఓపెన్‌గా మాట్లాడారు. ఒకప్పుడు ఇంత డబ్బు తన జీవితంలో వస్తుందని అసలు ఊహించలేదని చెప్పారు. తనకు వచ్చిన అవకాశాలు, ప్రేక్షకుల ఆదరణ అన్నీ అనుకోకుండా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు.

also read :ఆడిషన్ పేరుతో రెస్టారెంట్‌కు పిలిచి.. డ్రెస్ విప్పమంటూ దారుణం!

మొత్తానికి అంజిమామ తాజా ఇంటర్వ్యూలో చెప్పిన రేవంత్ రెడ్డితో భజ్జీ తిన్న జ్ఞాపకం, కేటీఆర్‌తో పరిచయం, గంగవ్వతో కుండ చికెన్ షూటింగ్ అనుభవాలు, మై విలేజ్ షో ద్వారా తన జీవితంలో వచ్చిన మార్పు.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలని ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టేశాడు అంజిమామ !

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×