Abhishek Bachchan: సినిమా సెలబ్రిటీలన్న తర్వాత నిత్యం వారు ఏదో ఒక విషయంలో వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్(Abhisekh Bachchan) ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను అభిషేక్ ఎన్నిసార్లు ఖండించిన ఈ రూమర్లకు అడ్డుకట్ట పడలేదు. అయితే గత కొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య ఇద్దరు విడివిడిగా మీడియా ముందు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ వార్తలకు బలం చేకూరింది.
రూమర్లను ఖండించిన అభిషేక్..
తాజాగా అభిషేక్ బచ్చన్ “కాళిధర్ లాపతా” (Kaalidhar laaptaa ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా జూలై నాలుగు నుంచి జీ 5 లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఐశ్వర్యతో విడాకులు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి విడాకుల వార్తల గురించి ఈయన స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేశారు. తాను ఐశ్వర్యతో విడిపోయాను అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు.
సంతోషంగా నా కుటుంబంతో..
నిజానికి మా గురించి వచ్చే ఇలాంటి అసత్యపు వార్తలను తాను అసలు పట్టించుకోను. నేను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను నిర్లక్ష్యం చేస్తూ, నెగిటివ్ వార్తలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఈయన కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. నా భార్య ఐశ్వర్య అలాగే నా కూతురు, తల్లి బయట మా గురించి వచ్చే నెగిటివ్ వార్తల ప్రభావాన్ని కుటుంబంపై పడకుండా జాగ్రత్త పడతారని తెలిపారు. నేను చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగాను ఎలాంటి విషయాలకు స్పందించాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది నాకు తెలుసని సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు మాపై ఎలాంటి ప్రభావం చూపవని తెలిపారు.
ఆరాధ్య పుట్టినరోజు వేడుకలు..
ఈ విధంగా అభిషేక్ బచ్చన్ తాను ఐశ్వర్యతో విడాకులు తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా వీరిద్దరి గురించి వచ్చే ఈ రూమర్లకు చెక్ పడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే 2007వ సంవత్సరంలో అభిషేక్ ఐశ్వర్యల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరాధ్య (Aardhya) అనే ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వివాహపు వేడుకలలో అభిషేక కుటుంబ సభ్యులందరూ ఒకసారి, ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి విడివిడిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వీరిద్దరి విడాకుల రూమర్లు బయటకు వచ్చాయి. ఇటీవల ఆరాధ్య పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో అభిషేక్ కనిపించకపోవడంతోనే ఈ వార్తలకు బలం చేకూరింది.
Also Read: మిత్రాశర్మ సాయం వెనుక ఇంత కథ ఉందా… అందరిని ఏడిపించేసిందిగా?