The paradise : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని ఈ ఏడాది హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ యాక్షన్ కథనంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది.. హిట్ మూవీకి సీక్వల్ గా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ని అందుకోవడంతో నాని ఖాతాలో మరో హిట్ సినిమా పడిపోయింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన దసరా చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో తాజా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ మూవీలో నాని ఎలా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాని లుక్ ను రీవిల్ చెయ్యడంతో పాటుగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
నాని రెండు జడల లుక్ అదిరింది..
గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరును రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇది ఒక అల్లికగా ప్రాంభమై.. విప్లవంగా ముగిసింది అంటూ పేర్కొంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని రెండు జడలతో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.. అంతేకాదు ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రిలీజ్ చేసేందుకు డేట్ ని లాక్ చేశారు. అదే రోజున మహేష్ బాబు సినిమా కూడా రిలీజ్ కాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి..
Also Read: సెప్టెంబర్ లో ఇంత పోటీనా..ఒక్కరోజే 5 సినిమాలు…
‘ ది ప్యారడైజ్’ స్టోరీ..
గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోను చూస్తే స్టోరీ దాదాపు అర్థమయిపోతుంది.. ఇందులో నాని యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. ‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు. అంటూ మొదలయ్యే గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ సాగే ఎలివేషన్ చూస్తుంటే మూవీలో యాక్షన్ వేరే లెవల్‌లో ఉందనిఅర్థం అవుతుంది. బానిసల్లా చూసిన ఓ వర్గం వారిని ఏకతాటిపైకి తెచ్చిన ఓ నాయకుడు ప్రత్యర్థులపై పోరాడి వారికి అండగా ఎలా నిలిచాడో చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజైన గ్లింప్స్‌ను బట్టి ఈ మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ కానుంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ మూవీ గ్లింప్స్ విడుదలైంది. స్పానిష్ భాషల్లో డబ్బింగ్ చెప్పిన తొలి భారతీయ నటుడిగా నాని రికార్డు సృష్టించారు.
Presenting Natural Star @NameisNani as '𝐉𝐀𝐃𝐀𝐋' from #TheParadise 💥💥
It started as a braid.
It ended as a revolution.In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.Natural Star… pic.twitter.com/86nP8UK6sE
— SLV Cinemas (@SLVCinemasOffl) August 8, 2025