BigTV English

Jr NTR Look: ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ అట్టర్ ప్లాప్… బీ టౌన్‌ ఆడియన్స్ రియాక్షన్ ఎంటంటే ?

Jr NTR Look: ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ అట్టర్ ప్లాప్… బీ టౌన్‌ ఆడియన్స్ రియాక్షన్ ఎంటంటే ?

North Audience Reaction on Jr NTR : మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ వార్ 2 నేడు థియేటర్లలో విడుదలైంది. తారక్‌ బాలీవుడ్‌ డెబ్యూ ఇస్తూ నటించని చిత్రమిది కావడంలో తెలుగులో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు నార్త్‌ లోనూ ఈ సినిమాకు విపరీతమైన బజ్ ఉంది. బాలీవుడ్‌ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఫస్ట్‌ పార్ట్‌ వార్‌ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమిది. దీంతో వార్‌ 2పై బి-టౌన్‌లో భారీ హైప్‌ ఉంది. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.


వార్ 2పై నార్త్ ఆడియన్స్ రియాక్షన్

తెలుగులో కంటే హిందీలో వార్‌ 2కి దారుణమైన రివ్యూస్‌ వస్తున్నాయి. మూవీ వీఎఫ్ఎక్స్, స్క్రీన్‌ ప్లే ఆడియన్స్‌ని డిసప్పాయింట్‌ చేసింది. సెకండ్‌ పార్ట్ ఫస్ట్‌ పార్ట్‌తో అసలు పోల్చలేనమంటున్నారు. సెకండ్‌ పార్ట్‌ కంటే ఫస్ట్ చాలా బాగుందంటున్నారు. ముఖ్యంగా వార్‌ 2 దర్శకత్వంపై విమర్శలు వస్తున్నాయి. కథని ప్రేక్షకుడు ఆకట్టుకునేలా రూపొదించడంలో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఫెయిల్‌ అయ్యాడంటున్నారు. సినిమాలో వాడిన వీఎఫ్‌ఎక్స్‌ పేలవంగా ఉందని, దీనికంటే వీడియో గేమ్స్‌లో వాడే వీఎఫ్‌ఎక్స్‌ చాలా బెటర్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మొత్తానికి తారక్కి గ్రాండ్‌ ఎంట్రీ అవుతుందన్నకున్న ఈ సినిమా ప్లాప్‌ టాక్‌ రావడంతో ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు.


ఈ చిత్రం ఎన్టీఆర్‌ రోల్ పెద్దగా ఎలివేట్‌అవ్వలేదంటున్నారు. మూవీ మొత్తంలో ఆయన ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ తప్పిదే మిగతా ఏది ఆకట్టుకోలేదు. హృతిక్ ముందు తారక్‌ కనిపించలేదంటున్నారు. ఇద్దరి మధ్య వచ్చిన యాక్షన్‌ సీక్వెన్స్‌లో హృతిక్ మాత్రమే హైలెట్‌ అయ్యాడని, ఎన్టీఆర్‌ అసలు కనిపించలేదంటున్నారు. సౌత్‌ సూపర్‌ స్టార్‌ అయిన ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌ ఎంట్రీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని రివ్యూర్స్‌ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ లుక్‌ చాలా బాగుంది. ఇందులో ఆయన బీస్ట్‌ మోడ్‌ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. కానీ, తెరపై హృతిక్ ముందు తారక్‌ ఆనలేదు.

తారక్ కి నిరాశే

మరే హీరో అయిన ఎన్టీఆర్‌ లుక్‌ హైలెట్‌ అయ్యేది. కానీ బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ లాంటి హృతిక్ పక్కన తారక్‌ లుక్‌ ఎలివేట్‌అవ్వలేదు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు పెద్దగా ఫాలోయింగ్‌ లేదనే చెప్పాలి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బి-టౌన్‌ ప్రేక్షకులు సుపరిచితం అయయాడు. కానీ,అయనకంటూ అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేదు. సౌత్‌ సూపర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌, ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తింపు ఉంది. దాంతో వార్‌ 2తో బాలీవుడ్‌ తన మార్కెట్‌ పెంచుకోవాలని అనుకున్నాడు. కానీ, మూవీకి ప్లాప్‌ టాక్‌ రావడం,హృతిక్ ముందు ఎన్టీఆర్‌ లుక్‌ ఎలివేట్‌ కాకపోవడం ఇవి తారక్‌ మైనస్‌ అయ్యాయి. వార్‌ 2 మూవీ ప్లాప్‌ టాక్‌ వచ్చినా.. బి-టౌన్‌ ఆడియన్స్‌ని తారక్ పర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుందేమో అని ఆశించారు. కానీ, హృతిక్ వల్ల అది కూడా జరగలేదు. మొత్తానికి వార్‌ 2 ఎన్టీఆర్‌కు ప్లస్‌ అవుతుందనుకుంటే.. మైనస్‌ అయ్యింది. ఇక మూవీ ప్లాప్ టాక్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ డెబ్యూని దారుణంగా నిరాశ పరిచిందనే చెప్పాలి.

Also Read: Jr NTR: అందరికీ దూరం… ఒంటరి పోరాటం… నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ మళ్లీ కౌంటర్ ?

Related News

SIIMA 2025 : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు, వాళ్లతో విభేదాలు?

Sravanthi Chokkarapu: జాతీయ జెండాను అవమానించిన యాంకర్‌ స్రవంతి చొక్కారపు? నెటిజన్స్‌ పైర్..

War 2 – Coolie : వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్… దీంట్లో కూడీ వీటి మధ్య వార్

Mirai Hindi Rights: కరణ్‌ జోహార్‌ చేతికి మిరాయ్‌ హిందీ రైట్స్‌.. తేజ సజ్జా ఖాతాలో మరో భారీ హిట్‌…

Hero Darshan: హీరో దర్శన్ కేసు ఎఫెక్ట్… ఆ హీరోయిన్ మళ్లీ అరెస్ట్ !

Aamir Khan: ఓన్లీ 50 రూపాయలే… అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమీర్ ఖాన్!

Big Stories

×