Karishma Kapoor Kids: మాజీ భర్త ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కింది బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా కపూర్. తన పిల్లలతో కలిసి ఆమె మాజీ భర్త భార్య ప్రియ కపూర్ పై న్యాయపోరాటానికి దిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తండ్రి ఆస్తిలోని తమ వాటా కోసం కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయనకు చెందిన దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తి విషయంతో తమ సవతి తల్లి ప్రియా కపూర్ మోసం చేస్తుందని వారు ఆరోపించారు. ఫ్యామిలీ మీటింగ్ తన తండ్రి రాసిన వీలునామా కాకుండా.. ఫేక్ డాక్యుమెట్స్ వీలునామా చూపించి మోసం చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తి పంపకాల విషయం కొత్త మలుపు తిరిగింది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ని 2003లో పెళ్లి చేుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు కూడా అయ్యాయి. కరిష్మా అతడికి రెండో భార్య.
కొంతకాలం అన్యోన్యంగా జీవించిన వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పదమూడేళ్ల పాటు కలిసి జీవించిన వీరు 2016లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సంజయ్ కపూర్.. ప్రియా సచ్ దేవ్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు. కరిష్మాతో విడాకుల తర్వాత ప్రియాను పెళ్లి చేసుకున్న సంజయ్ కపూర్.. ఈ ఏడాది జూన్ లో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో తర్వాత కుటుంబంలో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు.
Also Read: Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?
ఇటీవల రిగిన ఫ్యామిలీ మీటింగ్ లోనూ ఆమె నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు ఆమె నిరాకరిస్తుందని చెప్పారు. తమ తండ్రి రాసిన అసలు వీలునామా చూపించకుండ ఫేక్ వీలునామా చూపించి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. తమ తండ్రి ఆస్తిలో వాటా తమకు దక్కకుండ ప్రియా అడ్డుకుంటోందన్నారు. ప్రియా కపూర్, ఇద్దరు వ్యక్తులు (దినేష్ అగర్వాల్, నితిన్ శర్మ) కలిసి నకిలీ వీలునామా సృష్టించార ఆరోపించారు. దీంతో తమ తండ్రి ఆస్తిలోని తమకు రావాల్సిన వాటాను ఇప్పటించాలని కోర్టును కోరారు.
Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!