OTT Movie : కేరళ గ్రామీణ జీవితంలో పాతకాల ప్రేమను చూడాలను కుంటున్నారా ? అయితే ఈ మలయాళం మూవీని చూడాల్సిందే. ఇందులో పెద్ద స్టార్లు కూడా లేరు. మలయాళం సినిమాల్లో చిన్న బడ్జెట్ చిత్రంగా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందింది. చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్, ఫ్యామిలీ బాండింగ్, ప్రేమలో అక్సెప్టెన్స్ థీమ్‌లతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మోహన్ అనే డెడికేటెడ్ టీచర్, తన కెరీర్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి, డిమెన్షియా (మర్చిపోవడం వంటి మెదడు వ్యాధి)తో బాధపడుతున్న తండ్రిని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వస్తాడు. మోహన్ కి ఒక తల్లి, సోదరి కూడా ఉంటారు. తండ్రి వ్యాధి వల్ల ఈ కుటుంబ రోజువారీ జీవితం కష్టమవుతోంది. ఇక్కడే మాయా అనే కంపాషనేట్ కేర్‌గివర్ (నర్సింగ్ హెల్పర్) ఎంట్రీ ఇస్తుంది. ఆమె మోహన్ కుటుంబానికి సహాయం చేయడానికి వస్తుంది. మోహన్ తండ్రి వ్యాధిని చూసుకోవడంలో మాయాకి బాగా నైపుణ్యం ఉంటుంది. ఆమె సాఫ్ట్ నేచర్ మోహన్ పడిపోతాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, మోహన్, మాయా మధ్య పాతకాల స్టైల్ ప్రేమ మొదలవుతుంది.
మోహన్ తండ్రి వ్యాధి వల్ల వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా ఉంటాయి. మాయా రాకతో ఈ కుటుంబం కొంచెం స్థిరపడుతుంది. మోహన్, మాయా ల ప్రేమ చూడ చక్కని సన్నివేశాలతో కేరళ గ్రామీణ వాతావరణంలో నడుస్తుంది. కానీ కులం, మాయా ప్రొఫెషన్ వల్ల వీళ్ళ ప్రేమకు అడ్డంకులు వస్తాయి. మాయా గతంతో స్టోరీ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ మలుపు ఏమిటి ? మోహన్, మాయా ప్రేమ కథ పాస్ అవుతుందా ? ఫెయిల్ అవుతుందా ? మయా గతం ఏమిటి ? ఈ స్టోరీ ఎలాంటి ముగింపును ఇస్తుంది. అనే విషయాలను ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘పచంజన్ ప్రణయం’ (Pazhanjan Pranayam) బినీష్ కలరిక్కల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం రొమాంటిక్ సినిమా. దీనిని ఇతిహాసా మూవీస్ పతాకంపై వైశాక్ రవి, స్టాన్లీ జోషువా నిర్మించారు. ఇందులో రోనీ డేవిడ్ రాజ్ (మోహన్), విన్సీ అలోషియస్ (మాయా) ప్రధాన పాత్రల్లో నటించారు, అజీజ్ నెడుమంగడ్, ప్రదీప్ కొట్టాయం, అమోష్ పుత్తియట్టిల్ మొదలైనవారు సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. సతీష్ రాఘునాథ్ సంగీతం, అమోష్ పుత్తియట్టిల్ కెమెరా, అరుణ్ రాఘవ్ ఎడిటింగ్‌తో ఈ సినిమా 2023 నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. 2024 ఆగస్టు 16 నుండి సైనా ప్లే (Saina Play)లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 49 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది.
Read Also : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ