E-Paper
Advertisement

Karthi Kalyan: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌తో కార్తీ మూవీ.. ఫుల్ డిటైల్స్ ఇవే..

Karthi Kalyan: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌తో కార్తీ మూవీ.. ఫుల్ డిటైల్స్ ఇవే..
Advertisement

Karthi Kalyan: కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమా ఇక్కడ సొంత సినిమాగానే ప్రేక్షకులు భావిస్తారు. తాజాగా కార్తీ తన తదుపరి చిత్రాన్ని ఒక టాలెంటెడ్ తెలుగు దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి వార్త వినిపిస్తోంది. ‘మ్యాడ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించిన కల్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణ్ శంకర్ తన మొదటి సినిమా ‘మ్యాడ్’ (MAD), దాని సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’తో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో ఉండే టైమింగ్, కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కార్తీ వంటి ఎనర్జిటిక్ హీరోతో కల్యాణ్ జతకట్టడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఇందులో కార్తీ మార్క్ హ్యూమర్ తో పాటు కల్యాణ్ శంకర్ స్టైల్ ఫన్ కూడా ఉంటుందని సమాచారం.

Read also-Nindu Noorella Saavasam Serial Today February 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను కలిసేందుకు వెళ్లిన మిస్సమ్మ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

Advertisement

ఈ భారీ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. నిర్మాత నాగవంశీ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సూర్య 46వ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు తమ్ముడు కార్తీ సినిమాను కూడా లైన్‌లో పెట్టడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించనున్నారు. కార్తీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘సర్దార్ 2’ మరియు ‘మార్షల్’ (Marshal) వంటి చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ‘మార్షల్’ షూటింగ్ పూర్తయిన వెంటనే, అంటే ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కల్యాణ్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Read also-Kannada Comedy Horror : ఐదు దెయ్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అభాగ్యుడు… ఓటీటీలోకి కన్నడ కామెడీ హారర్

Advertisement

కార్తీకి తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ కాలం నుండి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నేరుగా తెలుగు దర్శకుడితో, అది కూడా కామెడీ సెన్స్ ఉన్న డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు (నటీనటులు, సాంకేతిక నిపుణులు) త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సూర్య కన్నా కార్తికే తెలుగులో ఎక్కవ ఫాలోయింగ్ ఉంది. కార్తి ఒక తెలుగు వ్యక్తిలా కలిసిపోయారు. నాగర్జునతో తెలుగు మూవీలో నటించి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇప్పడు మరో స్ట్రైట్ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×