Shahid Afridi On IND VS PAK: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో పాక్ విక్టరీ అందుకుంది. అయితే, ఈ ఒక్క మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించడంతో దాయాది దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అటు పాక్ మాజీలు కూడా రెచ్చిపోయి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వరల్డ్ కప్ గెలిచినంతగా ఫీల్ అవుతున్నారు. మొన్న హాంకాంగ్ సిక్సెస్, నేడు అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్, రేపు 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియా చిత్తుగా ఓడిస్తామని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ విజయంపై మాజీ సారధి షాహిద్ అఫ్రిది వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని, ఇకపై అన్ని మ్యాచ్ లు ఓడిపోవడం గ్యారెంటీ అంటూ వెల్లడించాడు. ఈ విజయంతో పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా ర్యాలీలు తీయాలని పిలుపునిచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ టీమిండియాను ఓడిస్తామని, ఫైనల్స్ తామే గెలిచి ట్రోఫీ తీసుకువస్తామని ప్రకటించాడు. గతంలో లాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు బలహీనంగా లేదని, యంగ్ క్రికెటర్లతో చాలా బలంగా తయారైందని వ్యాఖ్యానించాడు. గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపిస్తామని శపథం చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత ప్లేయర్లు బ్యాటింగ్ చేయలేరని, హైవే లాంటి పిచ్ లు అక్కడ ఉండబోవని వ్యాఖ్యానించాడు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడైనా సూపర్ గా ఆడుతుందన్నాడు.
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా భారత జట్టును ఓడించిన జూనియర్ పాకిస్తాన్ ప్లేయర్లకు మాజీ సారధి షాహిద్ అఫ్రిది (Shahid Afridi) బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. పాక్ ప్లేయర్లందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తానని అతడు హామీ ఇచ్చాడట. తాను ఇచ్చిన స్కూటర్లపై భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా తీయాలంటూ అఫ్రిది పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, స్కూటర్లు ఇస్తానని ప్రకటించినట్టు పోస్ట్ వైరల్ అవుతోంది. అటు భారత్ పై గెలిచిన తరుణంలోనే పాకిస్తాన్ వారం రోజుల పాటు సెలవులను ప్రధాని షరీఫ్ (Pak PM Sharif)ప్రకటించాడని కూడా ప్రచారం చేస్తున్నారు.