Garividi Lakshmi OTT: ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉంది ఈ నేపథ్యంలోనే 1980,90 దశాబ్దాలలో జానపద కథలు, బుర్రకథలు ఎంతో ప్రాచుర్యంలో ఉండేది. ఇలా జానపద కళాకారిణిగా ఉత్తరాంధ్రలో ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) ఒకరు. ఇలా జానపద కళా కారిణిగా గుర్తింపు పొందిన గరివిడి లక్ష్మి బయోపిక్ సినిమాగా ఇటీవల ‘గరివిడి లక్ష్మి’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటి ఆనంది(Anandhi) గరివిడి లక్ష్మి పాత్రలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఇలా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)కైవసం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా నవంబర్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్నట్టు తెలుస్తుంది.
గౌరీ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. తన జీవితంలో గరివిడి లక్ష్మి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అలాగే అంతరించిపోతున్న జానపదాల గురించి కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ సినిమా కథలోని భావోద్వేగాలు నటి ఆనంది నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గరివిడి లక్ష్మీ పాత్రలో నటి ఆనంది ఒదిగిపోయి నటించారు. ఇక ఆనంది తల్లి పాత్రలో సీనియర్ నటి రాశి నటించారు. వీరితోపాటు వీకే నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ వంటి తదితరులు కీలకపాత్రలో నటించారు.
విజయనగరం సమీపంలోని గరివిడి గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి (ఆనంది) చిన్నతనంలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విజయలక్ష్మి తల్లి దేవుడమ్మ (రాశి) ఒంటరిగా మారుతుండగా, లక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగి ఆ బంధం కూడా పెటాకులైపోతుంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆమె జీవితంలోకి మొదట పాట, ఆ తర్వాత బుర్రకథ ప్రవేశిస్తాయి. మగవాళ్లదే ఆధిపత్యం ఉండే ఆ కళారూపంలో తన ప్రతిభతో లక్ష్మి అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే ఆమె ప్రయాణంలో సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేశ్) పాత్రల పరిచయం ఎలాంటి మలుపులు తిప్పింది? తన కళతో ఎంతో పేరు తెచ్చుకున్న ఆ కళాకారిణి అనూహ్యంగా అదృశ్యమవడానికి కారణమేంటి? గరివిడి లక్ష్మి చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా అనేది ఈ సినిమా కథ.
Also Read: అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?