E-Paper
Advertisement

మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లను సెట్ చేసిన అనిల్ రావిపూడి..ఆ ఇద్దరు ఎవరంటే?

మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లను సెట్ చేసిన అనిల్ రావిపూడి..ఆ ఇద్దరు ఎవరంటే?
Advertisement

Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి వరుసగా సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపుడి తదుపరి సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని వెంకటేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

2027 సంక్రాంతికి టార్గెట్ చేసిన అనిల్ రావిపుడి..

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో నటుడు కళ్యాణ్ రామ్ కూడా నటించబోతున్నారు. ఇలా మల్టీ స్టార్టర్ సినిమాగా తెరకేక్కబోతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, సైన్ స్క్రీన్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిందని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి కన్ఫర్మ్..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమా హీరోయిన్ల గురించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసిందే. కృతి శెట్టి కళ్యాణ్ రామ్ జోడిగా నటించబోతున్నారని వార్తలు వచ్చిన విధంగానే ఈ సినిమాలో కృతి శెట్టి(Kriti Shetty) నటించబోతున్నట్లు స్వయంగా అనిల్ రావిపూడి తెలియజేశారు.

వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్..

Advertisement

ఇక వెంకటేష్ జోడిగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది .అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్ దాదాపు కన్ఫామ్ అయ్యారని, త్వరలోనే ఈ ఇద్దరు హీరోయిన్లకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. కీర్తి సురేష్ కి ఇటీవల కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలకు కమిట్ అవ్వలేదు ఈమె చివరిగా నాని హీరోగా నటించిన దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈమె నటించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇది దేవుడిచ్చిన బంధం.. ఆ కమెడియన్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×