Keerthy Suresh: కీర్తి సురేష్ (Keerthy Suresh) మలయాళంలో గీతాంజలి అనే సినిమా ద్వారా మొదటిసారి నటిగా వెండి తెరపై సందడి చేశారు. ఇక ఈమె బాలనటిగా పలు సినిమాలలో నటించిన గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తెలుగులో అయితే రామ్ హీరోగా నటించిన నేను శైలజ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే తన అమాయకమైన చూపులు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక మహానటి(Mahanati) సినిమాతో కీర్తి సురేష్ ఏకంగా జాతీయ స్థాయి అవార్డు(National Award) అందుకున్న విషయం తెలిసిందే.
నేషనల్ అవార్డు…
ఇలా మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక ఈమె తెలుగులో చివరిగా నానితో నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి అనంతరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి తెలుగు సినిమాలకు కమిట్ అవ్వలేదు.
విజయ్ దేవరకొండతో మహానటి..
ఇక త్వరలోనే కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ తో కలిసి “ఉప్పుకప్పురంబు”(Uppu Kappurambu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జులై 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే గత కొద్దిరోజులుగా ఈమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో(Vijay Devarakonda) కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.
దిల్ రాజు నిర్మాణంలో…
ఇక ఉప్పు కప్పురంబు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది. రవి కిరణ్ కోలా(Ravi kiran Kola) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో కలిసి మీరు నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమేనా? అంటూ ప్రశ్న వేయడంతో కీర్తి సురేష్ ఏకంగా దిల్ రాజు(Dil Raju) గారు చెబుతారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా దిల్ రాజు గారు చెబుతారని చెప్పడంతో ఈ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యిందని, ఈ విషయాన్ని నిర్మాతగా దిల్ రాజు అధికారికంగా తెలియజేస్తారని చెప్పకనే చెప్పేశారు. ఇక కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఇదివరకే అశోక వనంలో అర్జున కళ్యాణం, రాజావారు రాణి గారు అనే సినిమాలకు దర్శకుడిగా పని చేసిన విషయం తెలిసిందే.
Also Read: The Raja Saab Teaser : టీజర్ లీక్… మూడు రోజుల ముందే కుట్ర… పోలీస్ కంప్లైట్ ఇచ్చిన టీం