BigTV English

Honey Facial: హనీ ఫేషియల్.. ఇలా వాడితే అమ్మాయిలే అసూయపడే అందం

Honey Facial: హనీ ఫేషియల్.. ఇలా వాడితే అమ్మాయిలే అసూయపడే అందం

Honey Facial: తేనె చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో కూడా తేనెను ఉపయోగిస్తారు. తేనె చర్మానికి అవసరం అయిన పోషణను అందిస్తుంది. తేనెతో మే
తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న తేనెతో ఫేషియల్‌ కూడా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


ఇంట్లోనే హనీ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ?

1.తేనె ఫేస్ మాస్క్:
తేనెతో ఫేస్ మాస్క్ తయారు చేయడానికి, ముందుగా తేనె తీసుకొని ముఖం మొత్తం మీద తేలికగా అప్లై చేయండి. ఆ తర్వాత.. దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి.. కాటన్ టవల్ తో మెల్లగా ఆరబెట్టండి. ఈ ఫేస్ మాస్క్ చర్మానికి తక్షణ హైడ్రేషన్ ఇస్తుంది. అంతే కాకుండా సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది.


2.తేనె స్క్రబ్:
తేనెతో స్క్రబ్ తయారు చేయడానికి.. ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ చక్కటి చక్కెర లేదా రాక్ సాల్ట్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 2-3 నిమిషాలు సున్నితంగా స్క్రబ్ చేయండి. ఈ ప్రక్రియ మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేస్తుంది.

3.తేనెతో టోనర్:
తేనెతో టోనర్ తయారు చేయడానికి.. 2-3 టీస్పూన్ల గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలపండి. తర్వాత దీనిని కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి లేదా స్ప్రే బాటిల్‌లో నింపి ముఖంపై స్ప్రే చేయండి. ఈ టోనర్ స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తాజాగా చేస్తుంది.

4.తేనె, పాలతో.. గ్లో బూస్టర్ మాస్క్:
తేనె, మిల్క్‌తో గ్లో బూస్టర్ మాస్క్ తయారు చేయడానికి.. ఒక టీస్పూన్ పచ్చి పాలలో ఒక టీస్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ చర్మంలో తేమను నిలుపుకుంటుంది. నిస్తేజమైన చర్మానికి జీవం పోస్తుంది. ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది.

హనీ ఫేషియల్ వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:
తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. అంటే ఇది గాలి నుండి తేమను గ్రహించి మీ చర్మంలో నిలుపుకుంటుంది. అంతే కాకుండా చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచుతుంది. మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి హనీ ఫేషియల్ చాలా మేలు చేస్తుంది.

చర్మ సమస్యలను తగ్గిస్తుంది:
తేనెలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మానికి కొత్త మెరుపును కూడా అందిస్తుంది.

చర్మాన్ని మృదువుగా చేస్తుంది:
తేనె చర్మం పై పొరను మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా కనిపించేలా చేస్తుంది.

సహజమైన మెరుపు:
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను నిర్విషీకరణ చేస్తాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అంతే కాకుండా చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా కనిపించకుండా నిరోధిస్తుంది.

Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే జీవితంలో తెల్ల జుట్టు రాదు

వృద్ధాప్య సంకేతాలు:
తేనెలో ఉండే ఎంజైమ్‌లు, పోషకాలు చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడటానికి సహాయపడతాయి. దీని కారణంగా ముడతలు, చక్కటి గీతలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉంచుతుంది.

చర్మం రంగును మెరుగుపరుస్తుంది:
తేనె చర్మంపై మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.ఇది మీ చర్మపు రంగును ప్రకాశవంతంగా చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×