Jamun Leaves Uses: వర్షాకాలంలో నేరేడు పండ్లు మార్కెట్‌లో ఎక్కడ చూసిన అవే కనిపిస్తాయి. ఈ పండు కాస్త వగరుగా, తియ్యగా ఉంటుంది. నేరేడు పండు అంటే ఇష్టపడని వారు అంటు ఎవరు ఉండరు. నేరేడు పండులో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ వారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. అయితే నేరేడు పండులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే చాలా మంది ప్రజలకు నేరేడు పండు చేసే మేలు గురించి తెలుసు.. కానీ నేరేడు ఆకు కూడా ఎన్నో ఆనారోగ్య సమస్యలను నివారిస్తుందని తెలియదు. నేరేడు ఆకులో అనేక వ్యాధులను నివారిస్తుందని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకును భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
షుగర్‌కు చెక్:
నేరేడు ఆకులోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను టీ చేసుకుని టీ తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. నేరేడు ఆకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకుల కషాయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
సంతాన లేమి సమస్యకు చెక్:
నేరేడు ఆకులు ప్రకృతి సహజ సిద్దంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే దీనిలో ఫినోలిక్ కాంబోన్స్ కూడా ఉంటాయి. నేరేడు ఆకులు స్త్రీలలో సంతానం కలగడంలో ఉండే అడ్డంకులను దూరం చేస్తుంది. అండాశయం లేదా ఎండూ మేట్రియం ఫంక్షనల్ డిజార్టర్ కారణంగా సంతానోత్పత్తి కలగకపోతే నేరేడు లేత ఆకుల నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని రెండు స్పూన్ల రసంకు అర స్పూన్ తేనే కలిపి తీసుకోవడం వల్ల సమస్య తగ్గి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
నోటి ఆరోగ్యం:
నేరేడు ఆకులు దంత సమస్యలను నివారిస్తుంది. అయితే నేరేడు ఆకులను చూర్ణంలా చేసి భద్రపరుచుకోవాలి. ఈ చూర్ణంతో పళ్లు తోమితే దంతాలు గట్టిపడతాయి. దంత సమస్యలు పోతాయి, చిగుళ్లను ఆరోగ్యంగా చేసి గట్టిగా చేస్తుంది. దీని రసం నోటి దుర్వాసనను పొగుడుతుంది, నోటిలో పుండ్లు రాకుండా నివారిస్తుందని పలు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు మాయం:
నేరేడు ఆకులు కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. నేరేడు ఆకుల రసం తీసుకుని దాంట్లో కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి రోజుకు రెండు సార్లు తాగితే కిడ్నీలో రాళ్లు ఇట్టే మాయం అవుతాయి.
Also Read: వేపాకుతో ఎన్ని రోగాలకు చెక్ పెట్టోచ్చో తెలుసా?
దురద, దద్దులు సమస్య:
నేరేడు ఆకులను తీసుకుని దానిని పేస్ట్ లాగా చేసి పురుగులు ముట్టిన చోట దద్దులు, దురదల వంటివి తగ్గుతాయని తెలిపారు. అలాగే గొంతు నొప్పి సమస్య, కంఠస్వరం బాగా రావాలన్నా నేరేడు ఆకుల రసం తీసుకుని తరచూ పుక్కిలిస్తూ ఉండాలి లేదా లేత ఆకులను నమిలి నీటితో పుక్కిలిస్తూ ఉండాలని చెబుతున్నారు.
కీటక నివారణ:
నేరేడు ఆకుల పొగను దోమల వికర్షకంగా ఉపయోగించవచ్చు, అలాగే ఆకులను ఎండబెట్టి, దుస్తులలో ఉంచడం ద్వారా కీటకాలను తరిమికొట్టవచ్చు.