E-Paper
Advertisement

Yellamma : ఎల్లమ్మ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్, ఇంక అది జరిగినట్లే

Yellamma : ఎల్లమ్మ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్, ఇంక అది జరిగినట్లే
Advertisement

Yellamma : నటుడుగా పరిచయమైన వేణు తర్వాత కాలంలో జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తరువాత బలగం సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత సక్సెస్ సాధించింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్రామాల్లో ఆ సినిమాను తెర బొమ్మ వేసుకొని మరీ చూసి చాలామంది ఎమోషనల్ అయిపోయారు.

నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ నేను ఈ దశాబ్దంలో చూసిన అతి గొప్ప సినిమా బలగం అంటూ కామెంట్ కూడా చేశారు. అయితే బలగం సినిమా తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయింది. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి నాని తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది.

ఎల్లమ్మ పై కీర్తి క్లారిటీ

Advertisement

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా వస్తుంది అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. తమ్ముడు సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ ఎల్లమ్మ సినిమా మీద పడింది. మొత్తానికి ప్రాజెక్ట్ నుంచి నితిన్ పక్కకు వెళ్లిపోయాడు.

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా జరగబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే దానికి సంబంధించి అధికారికి ప్రకటన రాలేదు. దేవి శ్రీ ప్రసాద్ తో పాటు కీర్తి సురేష్ ఆ సినిమాలో నటించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే రివాల్వర్ రీటా ఆ సినిమా ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమాలో తను నటించట్లేదు అనే క్లారిటీ ఇచ్చేశారు.

ఎల్లమ్మ పరిస్థితి ఏంటి?

Advertisement

కొంతమంది దర్శకులకు మొదటి సినిమాతో విపరీతమైన సక్సెస్ వచ్చినా కూడా రెండవ సినిమా చేయడానికి టైం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దిల్ రాజు ప్రొడక్షన్లో ఉన్న ఇద్దరు డైరెక్టర్లకు అదే జరిగింది. రాజావారు రాణి గారు సినిమా సక్సెస్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా అనౌన్స్ అయింది రవి కిరణ్ కోలా కు. ఆ సినిమా రీసెంట్ గానే షూట్ స్టార్ట్ అయింది.

ఇక బలగం సినిమా తర్వాత సక్సెస్ అందుకున్న వేణు ఇప్పటివరకు తన సినిమాను పట్టాలెక్కించలేదు. మొత్తానికి కీర్తి సురేష్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇప్పుడు ఎవరు నటించబోతున్నారు అనే క్యూరియాసిటీ మళ్ళీ మొదలైంది. దీని గురించి అధికారిక ప్రకటన ఏమైనా ఇస్తారేమో చూడాలి.

Also Read: Trivikram: త్రివిక్రమ్ తో తమన్ కు చెడిందా? దూరం పెట్టడానికి కారణం ఏంటి?

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×