BigTV English

Keerthi Suresh : ఆ ఒక్కటి ఉంటే చాలు.. రెమ్యూనరేషన్ పట్టించుకోను..

Keerthi Suresh : ఆ ఒక్కటి ఉంటే చాలు.. రెమ్యూనరేషన్ పట్టించుకోను..

Keerthi Suresh : టాలీవుడ్ యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తుంది. మహానటి సినిమాతో యావత్ సినీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు అంతగా పేరు తీసుకురాలేదు. ఈమధ్య తెలుగులో అడపాదనప సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉప్పు కప్పురంబు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ఈ సందర్బంగా ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె షాకింగ్ నిర్ణయం గురించి బయటపెట్టింది..


రెమ్యూనరేషన్ పై కీర్తి సురేష్ ఓపెన్ కామెంట్స్..

మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి బిజీ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో మాత్రమే కాదు అటు తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. ఈమధ్య ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేసినట్లు కనిపించలేదు. ప్రస్తుతం ఉప్పుకప్పురంబు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. తన రెమ్యునరేషన్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నా విషయంలో పారితోషికం అనేది లాస్ట్ ఆప్షన్‌ అని చెప్పింది. తనకు మొదట కథనే చాలా ముఖ్యమని తెలిపింది. డిఫరెంట్ రోల్స్ చేయడమే నా లక్ష్యమని పేర్కొంది..ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి కీర్తి సురేష్ కు అలాంటి రోల్స్ వస్తాయేమో చూడాలి.. ఇక ఈమధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్తతో టైం దొరికినప్పుడల్లా వెకేషన్ లకు వెళుతుంది.. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది..


Also Read :సోమవారం టీవీల్లో రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

‘ఉప్పు కప్పురంబు’ మూవీ..

కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో హీరో సుహాస్ కాటికాపరి పాత్రలో కనిపించగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా కీర్తి, సుహాస్ కీలక విషయాలను పంచుకున్నారు.. ఈ సినిమాను కేవలం 28 రోజులు మాత్రమే షూట్ చేస్తున్నట్లు గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి భారీ అంచనాలతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేస్తుంది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ ఏ సినిమాకు వస్తుందేమో చూడాలి.. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం.

Related News

Film industry: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Raghava lawrance : మానవత్వాన్ని చాటుకున్న హీరో.. కన్నీళ్లు తెప్పిస్తున్న పోస్ట్..

Coolie collections : వీకెండ్ దారుణంగా పడిపోయిన కూలీ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే లోకీ..!

AA22xA6 Update : అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌కు అట్లీ మాస్టర్ ప్లాన్.. వందల మందితో..

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్.. అమ్మాయి ఎవరంటే..?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?

Big Stories

×