OTT Movie : మలయాళం సినిమాల పరిస్థితి ఒకప్పుడు ఉన్నట్లుగా లేదు. అప్పట్లో మలయాళం సినిమాలంటే షకీలా లాంటి ఫైర్ బ్రాండ్ లే గుర్తుకు వచ్చే వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 2007లో బెంగళూరులో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇది ఈ సినిమా దర్శకుడు జితు మాధవన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు, అతని ఫ్రెండ్స్ ఎదుర్కున్న సంఘటనలనుండి తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో
ఈ మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు ‘రోమంచం’ (Romancham). 2023 లో వచ్చిన ఈ సినిమాకు జితు మాధవన్ దర్శకత్వం వహించారు. ఇందులో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, సజిన్ గోపు, సిజు సన్నీ, అబిన్ బినో, అనంతరామన్ అజయ్, జగదీష్ కుమార్ నటించారు. చెంబన్ వినోద్ ఒక కామియో పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాని గుప్పీ ఫిల్మ్స్, జాన్‌పాల్ జార్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జాన్‌పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్, జోబీ జార్జ్ నిర్మించారు. ఇది 2023 ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
జిబిన్ (సౌబిన్ షాహిర్) అనే యువకుడు బెంగళూరులోని ఒక హాస్పిటల్ ICUలో మెనింజైటిస్‌తో బాధపడుతూ కళ్ళు తెరుస్తాడు. అతను తన రూమ్‌మేట్స్‌ను కలవాలని ఎదురుచూస్తాడు. కానీ వైద్యులు అతని ఆరోగ్యం కారణంగా ఎవరినీ కలవడానికి అనుమతించరు. ఒక నర్సు అతని కథను వినడానికి ఆసక్తి చూపుతుంది. జిబిన్ తన గత సంఘటనలను వివరిస్తూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాడు.
జిబిన్, రివిన్, నిరూప్, షిజప్పన్, ముఖేష్, కరికుట్టన్, సోమన్ అనే ఏడుగురు బ్యాచిలర్స్ బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో కలిసి నివసిస్తుంటారు. వీరిలో రివిన్, కరికుట్టన్ మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటారు. సోమన్ వ్యాపార ప్రయత్నాలు చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుకుతూ, సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. వీళ్ళ రూమ్ కూడా గజిబిజిగా, అపరిశుభ్రంగా ఉంటుంది. ఇది వీళ్ళ నిర్లక్ష్య జీవనశైలిని చూపిస్తుంది. ఒక రోజు జిబిన్ తన స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు, కొంతమంది ఒక Ouija బోర్డ్ ఉపయోగించి ఆత్మలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సన్నివేశాన్ని చూస్తాడు. ఈ ఆటను అతను తన రూమ్‌మేట్స్‌తో కలిసి ఆడాలని అనుకుంటాడు. వాళ్ళు ఒక కారం బోర్డ్‌ను Ouija బోర్డ్‌గా ఉపయోగించి, ఆటగా ప్రారంభిస్తారు.
ప్రారంభంలో ఈ ఆటను కామెడీగా తీసుకుంటారు. ఒకరినొకరు ఆటపట్టిస్తూ, నకిలీ ఆత్మలతో మాట్లాడుతున్నట్లు నటిస్తారు. అయితే అనమిక అనే ఒక ఆత్మ రావడంతో స్టోరీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అనామిక ఆత్మతో వీళ్ళు మాట్లాడటం మొదలుపెడతారు. ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. ఈ సంఘటనలు వాళ్ళని భయపెడతాయి. జిబిన్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరతాడు. అతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఒక మహిళ ఆత్మ తన బ్యాగ్‌లోకి ప్రవేశించినట్లు చెబుతాడు. ఈ క్లైమాక్స్ గందరగోళంగా మారుతుంది. చివరికి అనామిక ఆత్మ నిజంగానే ఉందా ? వాళ్ళు ఆత్మ ఉన్నట్టు ఊహించుకుంటున్నారా ? ఈ క్లైమాక్స్ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : 13 ఏళ్ల అబ్బాయితో ఇవేం పాడు పనులురా ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా?