BigTV English

OTT Movie : ప్రెగ్నెంట్ అయ్యాక భర్త తేడా అని తెలిస్తే… దిమ్మతిరిగే ట్విస్టులున్న సినిమా

OTT Movie : ప్రెగ్నెంట్ అయ్యాక భర్త తేడా అని తెలిస్తే… దిమ్మతిరిగే ట్విస్టులున్న సినిమా

OTT Movie : ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. భాషతో ప్రమేయం లేకుండా, ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఈ స్టోరీ ఒక తుపాకీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఉండే నాలుగు స్టోరీలు, తుపాకీతో కనెక్ట్ అవుతుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..


అహా తమిళ్‌ (aha Tamil)లో

ఈ తమిళ హైపర్‌లింక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్’ (Once Upon a Time in Madras). 2024 లో వచ్చిన ఈ సినిమాకి ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో భరత్, అభిరామి, అంజలి నాయర్, పవిత్ర లక్ష్మి, షాన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఫ్రైడే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై కెప్టెన్ ఎంపీ ఆనంద్ నిర్మించగా, జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం సమకూర్చారు. ఇది 2024 డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలై, 2025 జనవరి 17 నుంచి అహా తమిళ్‌ (aha Tamil)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

చెన్నైలోని కూవం నది సమీపంలో, రిటైర్డ్ ఆర్మీ అధికారి కృష్ణరాజ క్షణికావేశంలో, 9 ఏళ్ల బాలుడు దినేష్‌ను తుపాకీతో కాల్చి చంపుతాడు. అతను మామిడి చెట్టు నుండి పండ్లు కోసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడతాడు. పోలీసులు ఈ హత్యలో షూటర్‌ను గుర్తించలేకపోతారు. కృష్ణరాజ దీనిలోనుంచి బయటపడటానికి, తుపాకీని కూవం కాలువలో పడేస్తాడు. ఈ తుపాకీ ఇతర వ్యక్తుల చేతుల్లోకి చేరడం వల్ల, అనేక సంఘటనలకు దారితీస్తుంది. ఈ మూవీ నాలుగు స్టోరీల చుట్టూ తిరుగుతుంది.

సావిత్రి, కార్తి: సావిత్రి ఒక సానిటేషన్ వర్కర్. కూవం కాలువలో ఈ తుపాకీని గుర్తిస్తుంది. మరో వైపు ఆమె మూర్తి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని ఉంటుంది. అతని వేధింపులు కూడా ఎక్కువవుతాయి. ఆమె తన కుమార్తె కార్తిని మూర్తి నుండి రక్షించాలని అనుకుంటుంది. అతనికి ఆమె కుమార్తెపై చెడు ఆలోచన ఉంటుంది. ఇంతలో అప్పు చెల్లించడానికి సావిత్రి తుపాకీని విక్రయించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మూర్తి ప్రవర్తనతో విసిగిపోయి కాల్చి చంపుతుంది.

అనిత: అనిత అనే యువతి, వేరే కమ్యూనిటీ నుండి వచ్చిన కొలీగ్ తో ప్రేమలో పడుతుంది. ఆమె తండ్రికి కులాభిమానం ఎక్కువగా ఉండటంతో, ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇంతలో అతను తన కారులో ఒక తుపాకీని కనిపెడతాడు. అనిత రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకోబోతోందని తెలుసుకుని అక్కడికి వెళతాడు. దారిలో అతను కతిర్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇస్తాడు. వీళ్ళ మాటల్లో కతిర్, అనిత ప్రేమికుడని తండ్రి భావిస్తాడు. ఆవేశంలో అతను కతిర్‌ను తుపాకీతో కాల్చి చంపుతాడు. అయితే ఆ తరువాత రిజిస్ట్రార్ కార్యాలయంలో, అనిత వేరొకరిని వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కతిర్ ఆమె ప్రేమికుడు కాదని, ఒక అమాయకుడిని చంపినట్లు తండ్రికి అర్థమవుతుంది. ఇది అతన్ని తీవ్ర అపరాధ భావంలో ముంచెత్తుతుంది.

మధి: మధి అనే అమ్మాయికి కొత్తగా పెళ్ళి జరుగుతుంది. అయితే తన భర్త, అత్తమామలు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని అనుమానిస్తుంది. ఆమె భర్త ఆమెతో సమయం కేటాయించకపోవడంతో, ఆమెకు ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తుంది. ఈ అనుమానాలు ఆమె జీవితంలో అనేక సంఘటనలకు దారి తీస్తుంది. ఈ తుపాకీ ఆమె చేతికి రావడంతో ఆమె జీవితం మరింత గందరగోళంలో పడుతుంది.

రాజా, రాచెల్: రాజా ఒక అనాథగా పెరిగి, రాచెల్‌ను పెళ్ళి చేసుకుంటాడు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమెకు శస్త్రచికిత్స కోసం డబ్బు అవసరం అవుతుంది. రాచెల్‌ను రక్షించడానికి అతను ఒక హిట్ మ్యాన్ గా మారుతాడు. అతను ఈ తుపాకీతో ఒక సామాజిక కార్యకర్తను చంపుతాడు. అయితే అతను రాచెల్‌ను రక్షించే వ్యక్తి అని తర్వాత తెలుస్తుంది. ఈ తప్పు అతని జీవితంలో ఒక విషాదకరమైన మలుపును తీసుకొస్తుంది.

ఈ నాలుగు కథలు తుపాకీ చుట్టూ తిరుగుతాయి. ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి చేరుతూ, ప్రతి పాత్ర జీవితంలో ఊహించని మలుపులను తీసుకొస్తుంది.

Read Also : కట్టుకున్న భర్తను వదిలేసి ఎవడితో పడితో వాడితో… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా అయ్యా

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×