The Big Folk Night : ఇప్పటివరకు సంగీతానికి సంబంధించి ఎన్నో మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పటివరకు జానపద పాటలు సంబంధించి మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కార్యక్రమాలు జరిగిన సందర్భాలు ఎక్కడా లేవు అయితే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి “బిగ్ టీవీ”(Big Tv)శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్నో లక్షల సంఖ్యలో జానపద పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలా లక్షల సంఖ్యల్లో అద్భుతమైన పాటలను అందిస్తున్న తెలంగాణ జానపద గాయని గాయకులకు బిగ్ టీవీ పట్టాభిషేకం నిర్వహిస్తోంది. ఇలా జానపద పాటలకు బ్రతుకు నివ్వటానికి, బ్రతుకు పాటనివ్వటానికి బిగ్ టీవీ సగర్వంగా “ద బిగ్ ఫోక్ నైట్ 2025” (The Big Folk Night 2025)కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.
THE BIG FOLK NIGHT 2025
📍LB Stadium, AUGUST 23, FROM 6PM #AnIntiativeByBigTv #BigtvTelugu #SayNoToDrugs pic.twitter.com/kcdwMmI1rK
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025
“ద బిగ్ ఫోక్ నైట్ 2025 లైవ్ ఫోక్ మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్, ప్రోమో లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జానపద గాయని గాయకులు పాల్గొని సందడి చేశారు. ఇప్పటివరకూ ఎక్కడా జరగని విధంగా ఈ కార్యక్రమానికి బిగ్‌టీవీ ఒక కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఎలిమెంటల్ మీడియా ద్వారా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌నర్లుగా ద బిగ్ ఫోక్ నైట్ కార్యక్రమాన్ని కనివిని ఎరుగని రీతిలో జరపబోతున్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 23న BIG TV ఆధ్వర్యంలో " ది బిగ్ ఫోక్ నైట్-2025 "
తెలంగాణ జానపద కళాకారులను ఒకే వేదికపై తెచ్చే కార్యక్రమం
జానపద కళాకారులకు చేయుత అందించేందుకు తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అతిపెద్ద ప్రోగ్రామ్
తెలంగాణ ఆటాపాటలతో అలరించనున్న కళాకారులు… pic.twitter.com/3QgIk2c4Ew
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ టీవీ సీఈవో అజయ్ రెడ్డి కొండా(Ajay Reddy Konda) మాట్లాడుతూ…” తెలంగాణ జానపదంలో మట్టి పరిమళం ఇంకా మిగిలే ఉందని తెలిపారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న జానపదానికి మా వంతుగా ఏదైనా చేయాలని తలపెట్టిన కార్యక్రమమే ద బిగ్ ఫోక్ నైట్ 2025 అని ఈ సందర్భంగా అజయ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 23వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ ని ఎల్బీ స్టేడియంలో ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు. ఏకంగా 60 మంది తెలంగాణ జానపద కళాకారులు ఒకే వేదిక పంచుకోవడం చరిత్రలోనే ఇదే తొలిసారి అని, ఇలాంటి గొప్ప అవకాశం మా సంస్థ రూపంలో రావడం చాలా సంతోషంగా ఉందని అజయ్ రెడ్డి వెల్లడించారు.
మాదాపూర్ లోని HICC నోవాటెల్ లో THE BIG FOLK NIGHT-2025 పోస్టర్ ను ఆవిష్కరించిన కళాకారులు. https://t.co/bWzrC3cu4j pic.twitter.com/at0UZwfzdo
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ(Suddala Ashok Teja) కూడా మాట్లాడారు. ఒక మైకెల్ జాక్సన్, ఒక బుపెన్ హెజారికా, ఒక నూరాన్ సిస్టర్స్, ఒక రేష్మ, ఒక గద్దర్ ఒకే వేదికపై కనిపించే భాగ్యం ఈ తరం నోచుకోలేదు. ఇలాంటి గొప్ప వారికి దీటుగా తెలంగాణ జానపద కళాకారులు ఒక వేదికపై ఒకేసారి కనిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేమని, ఈ అద్భుతమైన దృశ్యాన్ని తప్పకుండా కన్నులారా చూసి తీరాల్సిందేనని అశోక్ తేజ ఈ కార్యక్రమం గురించి తెలిపారు.
The Big Folk Night 2025 Press Meet Live | Singer Madhupriya | Ramu Rathod | BIG TV LIVE https://t.co/04CW38XQh1
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025
సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్(Vandemataram Srinivas) కూడా మాట్లాడుతూ జానపద గాయకులందరినీ ఒకే వేదిక పైకి తీసుకువస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిగ్ టీవీ సంస్థకు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక ఈ కాన్సెప్ట్ పోస్టర్, ప్రోమో లాంచ్ కార్యక్రమంలో భాగంగా వేదికపై సింగర్ మధుప్రియ, రాము రాథోడ్, కనకవ్వ ఇతరులు చేసిన జానపద పాటల, నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. ఊర్రుతలూగించింది.
Also Read: అనారోగ్యంతో రేణు దేశాయ్.. ప్రముఖ హాస్పిటల్లో సర్జరీ?