Drugs Case: భవిష్యత్ బాగుండాలని లక్షలకు లక్షలు ఖర్చు చేసి తల్లిదండ్రులు చదివిస్తుంటే బుక్స్‌ను పక్కనపెట్టి డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తారు. బాగా చదువుకుని తమను ఉద్దరిస్తారని భావిస్తారు. కానీ విద్యార్థులు మాత్రం మందు, సిగరెట్లు పోయి.. ఇప్పుడు ఏకంగా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఎస్.. మీరు ఉంటుందన్నది నిజమే.
తల్లిదండ్రుల నిర్లక్ష్యమే.. యువత డ్రగ్స్ తీసుకోవడానికి కారణమా..
తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో కాలేజీలో డ్రగ్స్ గబ్బు లేపుతోంది. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు.. మత్తుకు చిత్తవుతున్నారు. మంచి భవిష్యత్ ఉన్నవాళ్లు డ్రగ్ అడిక్ట్‌గా తయారవుతున్నారు. డీయర్ పేరెంట్స్ మీకు అర్ధమౌతుందా? మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తున్నారా. పెద్ద చదువులు చదివిపిస్తున్నాం.. అనుకుంటే సరిపోదు..అక్కడ ఏం చేస్తున్నారో కూడా గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉండాల్సిదే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది ఓ లూక్ వేద్దాం.
మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
భాగ్యనగరంలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి యువతను తన బానిసలుగా మార్చుకుంటుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలో అనేక మంది ఈ డ్రగ్స్ బారిన పడిన విషయం మరిచిపోకముందే.. మరో యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. బహూదర్‌పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో భారీగా గంజాయి, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ పోలీసులు.
గంజాయి సేవిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్
గంజాయి సేవిస్తున్న నలుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.15 కేజీల గంజాయి.. 47 గ్రాముల OG డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించింది ఈగల్ టీమ్. మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీ మారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ అయిన రాజేష్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా డ్రగ్ పార్శిల్స్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బీదర్ నుంచి డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు అధికారులు.
మెడిసిటి మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం
అంతకముందు మెడిసిటి మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. గంజాయి సరఫరా కేసులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మెడిసిటీ కాలేజీకి చెందిన 32 మంది మెడికోలు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. డ్రగ్ టెస్ట్‌లో 32 మంది మెడికోలకు గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు మహిళా మెడికోలు కూడా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మెడికో అర్ఫాత్ ఖాన్ నుంచి పోలీసులు 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ చాప కింద నీరులా విస్తరిస్తున్నాయా?
చూశారు కదా.. మెడికల్ కాలేజీల్లో డ్రగ్స్ ఏ రేంజ్‌లో విస్తరిస్తోందో. ఎంత మంది మత్తుకు అడిక్ట్ అవుతున్నారో. జస్ట్ ఇప్పుడు మనం చూసింది రెయిడ్స్ చేస్తే దొరికిన వారు మాత్రమే. మరి ఈ లెక్కన దొరకని వారి ఎందరో? సిక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తూ..మత్తుకు చిత్తు అవుతున్న విద్యార్థులు మరెందరో. సో పేరెంట్స్ స్టూడెంట్స్ విషయంలో కేర్ ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.
Also Read: గవర్నర్ చేతుల మీదుగా ఖైరతాబాద్ గణనాథుని తొలిపూజ
డ్రగ్స్ కేసులో చిక్కుకుంటున్న విద్యార్థులు
క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చౌకగా లభించడంతో పాటు గంజాయి తీసుకున్న విషయం చుట్టుపక్కల వారు గుర్తించలేకపోవడం ప్రధాన కారణం. అంతే కాకుండా మద్యం కంటే సులువుగా తక్కువ సమయంలోనే మత్తు ఆస్వాధించే అవకాశం ఉండటంతో గంజాయికి యువత అట్రాక్ట్ అవుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే బానిసలుగా మారుతున్నారు.