Suleiman Shah: ఈ ఏడాది జరిగిన పహాల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వీరి తీసిన ఉగ్రవాదుల్లో సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు కాల్పుల్లో సులేమాఆపరేషన్ మహాదేవ్.. పహల్గామ్ మాస్టర్ మైండ్ సులేమాన్ షా హతం.. న్ షాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు ఈ చర్యను చేపట్టాయి. లష్కరే తొయిబా ఉగ్రవాదిగా గుర్తించబడిన సులేమాన్ షా పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేసినట్టు వార్తలు వస్తున్నాయి. అతడిపై పోలీసులు రూ. 20 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
మృతిచెందిన ఉగ్రవాదులు వీరే..
భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఆపరేషన్ శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలో, దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైంది. విదేశీ ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్ జబర్వాన్, మహాదేవ్ రిడ్జ్‌ల మధ్య జరిగింది. అందుకే దీనిని ఆపరేషన్ మహాదేవ్ అని పిలిచారు. ఈ ఆపరేషన్‌లో మృతిచెందిన మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను జిబ్రాన్, హంజా అఫ్ఘానీగా గుర్తించారు. జిబ్రాన్ గత ఏడాది సోనమార్గ్ టన్నెల్ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తో్ంది.
డేంజర్ టెర్రరిస్ట్ హతం..
భద్రతా బలగాలు ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధ సామాగ్రిని స్వాధీన పరుచుకున్నారు. గత నెల రోజులుగా అందిన నిఘా సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులు దాచిగాం ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది అమాయక టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత హర్వాన్‌లోని ముల్నార్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సులేమాన్ షా లాంటి డేంజర్ టెర్రిరిస్ట్ ను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత భద్రతా బలగాల నిబద్ధతను మరోసారి నిరూపించింది.
ALSO READ: Viral Video: ఈ పాము ఆస్కార్ పర్ఫార్మెన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే బ్రో..
సులేమాన్‌ను మట్టుబెట్టాం: చినార్ కార్ప్
ఆర్మీకి చెందిన చినార్ కార్ప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి సులేమాన్ ను హతమార్చినట్టు తెలియజేసింది. ‘లిడ్వాస్ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాం. భీకర కాల్పుల్లో ముగ్గురిని చంపేశాం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది’ అని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. వీరు ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులే కాగా.. అత్యంత ప్రాధాన్య గల టార్గెట్లుగా పోలీసులు గుర్తించారు.. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు హర్వాన్ ప్రాంతంలో ఆపపరేషన్ ప్రారంభించాయి. అక్కడకు అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.