Vijay Devarakonda: గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్డమ్. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు రకాల కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అక్కడక్కడ మిశ్రమ స్పందన కూడా లభిస్తుంది.
అయితే విజయ్ లాస్ట్ ఇయర్స్ లో చేసిన అన్ని సినిమాలు కంటే ఈ సినిమా బెటర్ ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా నేడు రిలీజ్ అయిన తరుణంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు.
నన్ను చాలామంది ఏడిపించారు
నిన్న రాత్రి 10:30 కి యూఎస్ లో కింగ్డమ్ షోస్ స్టార్ట్ అయ్యాయి. నాకు అప్పటినుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. కొంతమంది నెంబర్స్ కూడా చెబుతున్నారు. కొంతమంది థియేటర్లో కూర్చుని ఏడుస్తూ ఫోన్ చేస్తూ అన్నా మనం కొట్టినం అంటున్నారు. నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా మేనేజర్ అనురాగ్ కూడా ఫోన్ చేసి చాలా సేపు ఏడ్చాడు. నేను చాలామందిని ఆపుతున్నాను. ఎందుకంటే మమ్మీ ఏడిస్తే చాలామంది ఏడుస్తాం కదా. ఇంక ఈ ఏడుపులు నావల్ల కాదు అని నేనే ఆపేసాను.
ఈ సినిమా నాకు ఇంపార్టెంట్
ప్రత్యేకించి ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఈ సినిమా సక్సెస్ అనే విన్న తర్వాత వెరీ రిలీఫ్ గా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ వలనే ఇది సాధ్యమైంది. మీ మీడియా అంతా నా వెనక ఎంత సపోర్ట్ చేస్తున్నారో నేను చూసిన, తెలుగు ప్రజలు ఎంతమంది నాకు సపోర్ట్ గా ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నాను. నా ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్న. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ప్రేమ మీ ఆశీస్సులు అంటూ విజయ్ ఎమోషనల్ అయిపోయారు.
Also Read: Satya Dev: సత్యదేవ్ కి అసలైన కం బ్యాక్, కానీ క్రెడిట్ గల్లంతు