E-Paper
Advertisement

భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు

భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు
Advertisement

Wife Weeping Not Cruelty| ఒక మహిళ తరచూ ఏడుస్తోందని, అత్తింట్లో సంతోషంగా లేదని చెప్పడం మాత్రమే ఆమెపై వేధింపులు జరిగాయని: నిరూపించగలవా?  నేరారోపణలు చేసినప్పుడు వాటికి బలమైన ఆధారాలు కూడా ఉండాలి. ఈ విషయాన్ని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భార్య ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో పాటు, వరకట్న వేధింపుల కేసులో 29 ఏళ్ల తరువాత కోర్టు తీర్పు చెప్పింది

భార్యకు అత్తింట్లో వేధించారని ఆరోపించిన తండ్రి

మనోహర్‌ అనే వ్యక్తికి రేఖ అనే మహిళతో 1997 మే 25న వివాహం జరిగింది. పెళ్లైన 2 నెలలకే కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని రేఖ తండ్రి ఆరోపించారు. ఇంటి ఖర్చులు, అప్పుల పేరుతో మనోహర్, ఆయన తల్లి డబ్బులు అడిగేవారని తెలిపారు. కుట్టు మిషన్ కూడా కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. తనకు వీలైనప్పుడల్లా డబ్బులు ఇచ్చానని రేఖ తండ్రి చెప్పారు.

Advertisement

బంధువుల వివాహం సందర్భంగా రూ.1,000 ఇచ్చినట్లు తెలిపారు. అయితే, రేఖ అత్తింటి నుంచి నవంబర్ 13, 1997న చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. అదే రోజు ఆమె భర్త మనోహర్ పోలీసులకు తన భార్య కనబడడం లేదని ఫిర్యాదు చేశాడు. నవంబర్ 17న ఆమె మృతదేహం నదిలో లభ్యమైంది. దీంతో అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని రేఖ తండ్రి ఆరోపిస్తూ తన అల్లుడు మనోహర్ పై ఫిర్యాదు చేశాడు.

కేవలం కన్నీళ్లతో వేధింపులను నిరూపించలేం: కోర్టు

ఈ కేసులో పుణె సెషన్స్ కోర్టు 1998 నవంబర్ 17న మనోహర్‌ను దోషిగా ప్రకటించింది. ఐపీసీ సెక్షన్లు 306, 498A కింద ఆయనకు శిక్ష విధించింది. సెక్షన్ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
2025 నవంబర్ 4న హైకోర్టు ఆయన అప్పీల్‌ను అనుమతించింది. రేఖ తల్లిదండ్రులు తొలుత పోలీసులకు ఇచ్చిన సమాచారంలో వేధింపుల గురించి ప్రస్తావించలేదు. తరువాతే ఈ ఆరోపణలు చేశారని కోర్టు గుర్తించింది.
రేఖ తల్లి కూడా ఆమె పుట్టింటికి వచ్చినప్పుడు మౌనంగా ఉండి ఏడ్చేదని చెప్పారు. అయితే, ఎందుకు బాధపడుతోందో రేఖ ఎప్పుడూ వివరించలేదని తెలిపారు. శారీరకంగా లేదా మానసికంగా వేధించినట్లు నిర్దిష్ట ఘటనలకు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

Advertisement

Also Read: భర్తకు లక్షల్లో పెరిగిన ఆదాయం.. రెట్టింపు భరణం కావాలన్న భార్య.. కోర్టు ఏం చెప్పిందంటే

ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కూడా ఆధారాలు లేవు

రేఖ ఆత్మహత్యకు మనోహర్ ప్రేరేపించినట్లు, కుట్ర చేసినట్లు లేదా ఉద్దేశపూర్వకంగా సహకరించినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. ఆరోపించిన డబ్బుల డిమాండ్లకు, ఆమె మరణానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కూడా నిరూపితం కాలేదని పేర్కొంది.

Also Read: రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం

అన్ని ఆరోపణల నుంచి భర్తకు విముక్తి 

ప్రాసిక్యూషన్ ఆరోపణలు సందేహాలకు తావులేకుండా నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో మనోహర్‌పై 1998లో విధించిన శిక్షను రద్దు చేసి, సెక్షన్లు 306, 498A కింద నమోదైన అభియోగాల నుంచి ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అప్పీల్‌కు సంబంధించిన తదుపరి ప్రక్రియ కోసం రూ.15,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.

Related News

రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

భార్య వంట చేయడం లేదని విడాకులిచ్చిన భర్త.. కోర్టు తీర్పు ఇదే

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ కంపెనీ వైస్ ఛైర్మన్‌తోపాటు ఫ్యామిలీ మృతి, ఘటన ఎలా జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×