Kiran abbavaram:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు కిరణ్ అబ్బవరం(Kiran abbavaram). ఇదే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది రహస్య గోరఖ్(Rahasya Gorakh). ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పండంటి కొడుకుకు జన్మనిచ్చింది రహస్య గోరఖ్ . ఇకపోతే ఇన్ని రోజులు కొడుకుతో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ జంట ఎట్టకేలకు తమ కొడుకును చూపించేశారు.
కొడుకుకు నామకరణం చేసిన కిరణ్ అబ్బవరం..
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేసిన వీరు.. తమ కొడుకుకు నామకరణం చేశారు. హను అబ్బవరం (Hanu abbavaram) అంటూ నామకరణం చేసినట్లు హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో వెల్లడించారు. “స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుమలలో నా కొడుకు నామకరణం విజయవంతంగా పూర్తి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. నా కొడుకుకి హను అబ్బవరం అంటూ నామకరణం చేసాము” అంటూ కిరణ్ అబ్బవరం తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తన కొడుకు ముఖాన్ని కూడా రివీల్ చేశారు. ఇన్ని రోజులు ఆ చిన్నారి ముఖాన్ని అభిమానులతో పంచుకోకుండా హైడ్ చేసిన ఈ జంట.. ఎట్టకేలకు పరిచయం చేసేశారు. ఈ ఫోటోలో హను అబ్బవరం చాలా క్యూట్ గా ఉన్నాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కొడుకుని చూపించడంతో అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#KiranAbbavaram కొడుకు పేరు HANU ABBAVARAM@Kiran_Abbavaram pic.twitter.com/yb0H5RNjf6
— BIG TV Cinema (@BigtvCinema) August 4, 2025
కిరణ్ అబ్బవరం సినిమాలు..
రాజావారు రాణిగారు అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నారు. మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, సెబాస్టియన్ పిసి 524 , వినరో భాగ్యము విష్ణు కథ , రూల్స్ రంజన్, మీటర్ వంటి చిత్రాలు చేసి ఆకట్టుకున్నారు.
ఇక ఇప్పుడు ‘ కే ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. నిర్మాతగా ఎస్కేఎన్.. దర్శకుడిగా సాయి రాజేష్ వ్యవహరిస్తున్నారు. ఈ కథను బేబీ టీం తో చేయాలని అనుకున్న ఎస్కేయన్ , సాయి రాజేష్ అనూహ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలను తప్పించి కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియను రంగంలోకి దింపారు.. ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల ఆఖరున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
also read: Geeta Singh: నరకం అనుభవించాను.. అందుకే పెళ్లికి దూరం – గీతా సింగ్