Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా గురించి ఎంతో క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ దర్శకత్వం చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి, ఈ సినిమాకి నాగవంశీ ఇస్తున్న ఎలివేషన్. ఈ సినిమా విషయంలో ఎటువంటి ప్రశ్నలకైనా ఆన్సర్ చేస్తాను అంటూ నాగవంశీ ఇప్పుడు చెబుతూ వస్తారు.
అలానే ఒక సినిమాకి సంబంధించి సినిమాటోగ్రఫీ, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇలా ఎన్ని టిక్కులు పెట్టుకుని వస్తారు వాటన్నిటికీ కూడా కింగ్డమ్ సినిమా ఆన్సర్ చెబుతుంది అంటూ మాట్లాడారు. ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదివరకే టీజర్ ట్రైలర్ మరియు సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేశారు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఎంకరేజ్ చేయమని అడిగేవాడిని
విజయ్ దేవరకొండ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కింగ్డమ్ రేపు రిలీజ్ అవుతుంది కదా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే, నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు థియేటర్ ప్లే చేసేవాడిని. ఆ రోజుల్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే నా ఫొటోస్ వేయండి యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పండి అని వాళ్లను అడిగేవాడిని. అప్పుడు అమ్మాయి నాకు మాకంటే పైన మా సార్ ఉంటారు సురేష్ అని ఆయనకు చెప్పండి అని చెప్పింది. నేను అప్పటినుంచి సురేష్ అన్నకి నా ఫోటోలు పంపించి ఎంకరేజ్ చేయండి. యాక్టింగ్ బాగా చేస్తాను అంటూ అడిగేవాడిని. అప్పటినుంచి మీరు నా జర్నీని చూస్తున్నారు.
ప్రశాంతంగా నిద్ర పట్టింది
సినిమా రేపు రిలీజ్ అయితే ఈరోజు విపరీతంగా ఫోన్ మోగుతుంది. రేపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ పుడుతుంది. నాకు గత సంవత్సరాలలో నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. నిన్న రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఈరోజు పొద్దున్నే లేచి వెళ్లి జిమ్ చేశా. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాను. ఈ కంటెంట్ సాటిస్ఫై ఉన్నాను అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇచ్చిన ప్రేమ. తెలుగు సినిమా ఆడియన్స్ మంచి బుకింగ్స్ ఇచ్చారు. కంటెంట్ పరంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కంటెంట్ బాగుంది మనం కచ్చితంగా హిట్ కొడుతున్నాము అని ప్రెస్ వాళ్ళు అంటుంటే అది ఒక హ్యాపీనెస్ అంటూ విజయ చెప్పుకొచ్చాడు. పొద్దున్నే డైరెక్టర్ గౌతమ్ తో మాట్లాడా ఆయన కూడా హ్యాపీగా ఉన్నాడు. ప్రెస్ మీట్ కి రమ్మంటే తిరుపతి వెళ్లే వస్తాను అని చెప్పాడు అని తెలిపారు.
Also Read: SSMB 29: మహేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జక్కన్న