BigTV English

OTT Movie : ఊళ్ళో వరుస హత్యలు… పౌర్ణమి వచ్చిందా గ్రామం వల్లకాడే… ఆస్కార్ విన్నింగ్ హర్రర్ మూవీ

OTT Movie : ఊళ్ళో వరుస హత్యలు… పౌర్ణమి వచ్చిందా గ్రామం వల్లకాడే… ఆస్కార్ విన్నింగ్ హర్రర్ మూవీ

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అయితే ఒక హారర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. అయినా కూడా ఈ సినిమా 2011లో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. రిక్ బేకర్ అద్భుతమైన మేకప్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ అవార్డును అందుకుంది. అంతేకాకుండా డానీ సంగీతం, ఎల్ఫ్‌మన్ సినిమాటోగ్రఫీకి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాపేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నాలుగు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది వోల్ఫ్‌మ్యాన్’ (The Wolfman) 1941లో విడుదలైన క్లాసిక్ హారర్ చిత్రానికి 2010లో రీమేక్‌గా వచ్చిన అమెరికన్ గోతిక్ హారర్ ఫిల్మ్. జో జాన్స్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బెనిసియో డెల్ టోరో, ఆంథోనీ హాప్కిన్స్, ఎమిలీ బ్లంట్, మరియు హ్యూగో వీవింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1891లో ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌మూర్ అనే ఊరిలో జరిగే ఒక వోల్ఫ్‌మ్యాన్ శాపం కథను చూపిస్తుంది. జియో హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో ది ఈ సినిమాకి 5.8/10 రేటింగ్ కూడా ఉంది.


స్టోరీలోకి వెళితే

1891లో లారెన్స్ అనే వ్యక్తి  అమెరికాలో జీవిస్తుంటాడు. అతని బాల్యంలో జరిగిన ఒక ట్రాజెడీ వల్ల తన తల్లిని పోగొట్టుకుంటాడు. ఆమె మరణించిన తరువాత తన తండ్రి జాన్ తో దూరమై ఉంటాడు. ఒక రోజు అతని సోదరుడు బెన్ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. బెన్ నిశ్చితార్థం గ్వెన్ కాన్లిఫ్ తో జరుగుతుంటుంది. లారెన్స్‌ను ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌మూర్‌లోని ఎస్టేట్‌కు రమ్మని గ్వెన్ కోరుతుంది. లారెన్స్ అక్కడికి వచ్చినప్పుడు, బెన్ మృతదేహం దారుణంగా చీల్చిచెండాడిన స్థితిలో కనిపిస్తుంది.

లారెన్స్ తన సోదరుడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనడానికి బ్లాక్‌మూర్‌లో ఉంటాడు. స్థానికులు ఈ హత్యల వెనుక ఊరి బయట ఉన్న ఒక డ్యాన్సింగ్ బేర్ హస్తం ఉందని అనుమానిస్తారు. కానీ కొంతమంది ఇది వోల్ఫ్‌మ్యాన్ లాంటి జీవి వల్ల జరిగిందని, దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పౌర్ణమి రాత్రి ఇలాంటి హత్యలు జరిగాయని చెబుతారు. ఇక లారెన్స్ ఒక పౌర్ణమి రాత్రి ఆ ప్రాంతంలో ఒక క్యాంప్‌కు వెళతాడు. అక్కడ మలేవా అనే మహిళ అతని సోదరుడికి ఏదో చెడు జరిగిందని చెబుతుంది. అదే సమయంలో స్థానికులను ఒక వోల్ఫ్‌మ్యాన్ లాంటి జీవి దాడి చేసి చాలా మందిని చంపేస్తుంది. ఈ దాడిలో లారెన్స్‌కు కూడా గాయమవుతుంది. కొన్ని వారాల్లో లారెన్స్ గాయం మానిపోతుంది. కానీ అతనికి వింత కలలు రావడం మొదలవుతాయి. లారెన్స్ బ్లాక్‌మూర్‌లో ఏదో భయంకరమైన జీవి తిరుగుతోందని తెలుసుకుంటాడు.

Read Also : మూవీ రిహార్సల్స్ పేరుతో బట్టలన్నీ విప్పించే డైరెక్టర్… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా సామీ

ఒక పౌర్ణమి రాత్రి లారెన్స్ ఒక మానసిక ఆసుపత్రిలో చేరతాడు. అక్కడ డాక్టర్ హోనెగర్ అతన్ని ఒక గదిలో పరిశీలిస్తూ, తన సహోద్యోగులకు పరిచయం చేస్తాడు. అయితే పౌర్ణమి కాంతి గదిలోకి వచ్చినప్పుడు, లారెన్స్ గదిలోనే వోల్ఫ్‌మ్యాన్‌గా మారిపోతాడు. అక్కడే డాక్టర్ హోనెగర్‌ను చంపేస్తాడు. ఆసుపత్రి నుండి తప్పించుకుని గ్వెన్‌ను కలవడానికి లండన్‌కు వెళ్తాడు. గ్వెన్‌తో మాట్లాడుతూ, లారెన్స్ తన శాపం గురించి తెలుసుకుంటాడు ఆమెను రక్షించడానికి, ఈ శాపాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్‌లో, లారెన్స్ తన తండ్రి సర్ జాన్‌ని ఎదుర్కొంటాడు. అతను కూడా ఒక వోల్ఫ్‌మ్యాన్‌గా మారతాడు. వీళ్లిద్దరూ ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొంటారు, చివరికి లారెన్స్ తన తండ్రిని చంపి, గ్వెన్‌ను రక్షిస్తాడు. అయితే ఈ పోరాటంలో లారెన్స్ కూడా తీవ్రంగా గాయపడతాడు. గ్వెన్ అతన్ని చంపకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది, కానీ చివరికి అతన్ని ఒక వెండి బుల్లెట్‌తో కాల్చి చంపేస్తుంది. లారెన్స్ శాపం నుండి విముక్తి పొందుతాడు.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×