BigTV English

Single Life: ఆడ తోడు లేని సింగిల్స్ ఎలా బతకాలి? ఆ కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

Single Life: ఆడ తోడు లేని సింగిల్స్ ఎలా బతకాలి? ఆ కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

ఈ రోజుల్లో చాలామంది సింగిల్‌గానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు. వీరికి తోడు దొరకడం అంత ఈజీ కాదు. ఒక వేళ అమ్మాయి ప్రేమ దక్కినా దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్. అందుకే చాలామంది సింగిల్‌గానే కాలం గడిపేస్తున్నారు. వయస్సు ముదిరినా ఎలాంటి శరీరక ‘సుఖం’ లేకుండా కాలం గడిపేస్తున్నారు. కోరికలు ఉన్నా సరే.. సభ్య సమాజంపై భయం.. ‘అది’ తప్పు అనే భావన వారిని మరింత వెనక్కి నెడుతోంది. అంతేకాదు అమ్మాయిలతో స్నేహం చేసినా.. ‘ఆ’ విషయాన్ని ఎలా అడగాలో తెలియక సతమతం అయ్యేవారు ఎందరో. ఈ రోజుల్లో ఒళ్లు చూపించే అమ్మాయిల ఇన్‌స్టా అకౌంట్లకు ఫాలోవర్లు పెరుగుతున్నారంటే కారణం.. ఇలాంటి సింగిల్సే. పాపం తోడు దొరక్క.. అందులో ఉండే కంటెంట్ చూస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇది ఒకింత మంచిదే కానీ.. అది అందరికీ కాదు. ఆడ తోడు లేని ఒంటరితనం.. ఆ సుఖం లేని శరీరం.. అనారోగ్యాలకు కూడా దారితీయొచ్చు. అందుకే అలాంటి సింగిల్స్ కోసం నిపుణులు కొన్ని సూచనలు తెలిపారు. వాటిలో కొన్ని మీ కోసం.


పెళ్లి వద్దంటారు.. కానీ, అవన్నీ కావాలంటారు. చివరికి ఏ తోడు దొరక్క పెళ్లి చేసుకుని సుఖపడాలని అనుకుంటారు. ఆ తర్వాత ఆ బంధాన్ని భారంగా ఫీలవుతారు. ఈ తరానికి ఇవన్నీ గందరగోళమే. ఒకవేళ మీరు సింగిల్ అయితే.. మీకు గర్ల్స్ ఫ్రెండ్స్ లేదా లవర్ లేనట్లయితే.. సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

కెరీర్‌పై ఫోకస్ పెట్టండి


ఆ పచ్చళ్ల అమ్మాయిలు ఏ ఉద్దేశంతో చెప్పారోగానీ.. మంచి విషయాన్నే చెప్పారు. సింగిల్ అని కుంగిపోయి ఇంట్లో కూర్చోకుండా కెరీర్‌ మీద ఫోకస్ పెట్టండి. మీ ఎదుగుదలే.. మీ ఒంటరితనాన్ని పోగొడుతుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఆడవారు ఉంటారని అంటారు. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు జీవితంలో విజయం సాధించే మగాడికే వాల్యూ ఎక్కువ. వారికే డిమాండ్ కూడా ఉంటుంది. కాబట్టి, సింగిల్ అనే ఆలోచన పక్కన పెట్టి చదువు, కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. పచ్చళ్లూ కొనగలరూ.. పడక సుఖాన్ని పొందగలరు.

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి

నా ఫ్రెండుగాడికి గర్ల్‌ఫ్రెండ్ ఉంది. నాకు లేదని మీలో మీరు కుమిలిపోకండి. పక్కోడి గురించి ఆలోచించడం మానేసి.. మీ గురించి ఆలోచించండి. లేకపోతే అది మానసిక రోగానికి దారితీయొచ్చు. ఒక వేళ మనసు భారంగా అనిపిస్తుంటే.. యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చెయ్యండి. తప్పకుండా మీ మనసు కుదుటపడుతుంది.

సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోండి

నేను ఒంటరి వాడిని.. నాతో ఎవరూ కలవరు.. అనే ఆలోచన నుంచి ముందు బయటపడండి. కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. అలాంటి సంబంధాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. నలుగురితో కలిస్తే.. మిమ్మల్ని మెచ్చేవారు ఏదో ఒక రోజు మీ ముందుకే రావచ్చు.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి

మరొకరి ప్రేమ కోసం ఎదురుచూసే మీరు.. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారా? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. ఇదే మీ ఆలోచన తీరును, మీ జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఏదైనా పని చెయ్యాలి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన అభిరుచులు.. ఆసక్తుల మీద స్పష్టత ఉండాలి. మన కోరికలను ఒక్కొక్కటీ తీర్చుకోవడమే.. మన మీద మనకు ఉండే ప్రేమ. ఇష్టమైన సినిమాలు చూడండి. నచ్చిన పుస్తకాలను చదవండి. ప్రయాణాలు చెయ్యండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకున్నప్పుడే.. భవిష్యత్తులో మీకు దొరికే భాగస్వామిని సైతం సంతోషంగా ఉంచుకోగలగుతారు.

డబ్బు ముఖ్యం బిడ్డ

డబ్బు మీ పరపతిని, గౌరవాన్ని పెంచుతుంది. మీరు ఎంత అందగాడైనా సరే.. డబ్బులేకపోతే పనికిరానివారిగానే చూస్తుంది ఈ సమాజం. కాబట్టి.. ముందు పొదుపు, పెట్టుబడులపై ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత అమ్మాయిలు.. పెళ్లి..  తదితర విషయాల గురించి ఆలోచించండి. ఆర్థిక స్థిరత్వం మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. డబ్బుంటే దేనికి లోటు ఉండదు. మీకు కావల్సినవి కాళ్ల వద్దకు వస్తాయి.

ఒంటరితనం వరం

ఒంటరితనం నరకం అనుకోవద్దు. అది మీకు ఒక వరం. సింగిల్‌గా ఉండటమంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని గుర్తుంచుకోండి. వీలైతే.. గర్ల్‌ఫ్రెండ్‌ను భరిస్తున్న మీ స్నేహితుల కష్టాలను ఒకసారి తెలుసుకోండి. కాస్త మీకు సంతోషం కలుగుతుంది. సింగిల్‌గా ఉన్నప్పుడు మీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గోల్స్‌పై ఫోకస్ పెట్టవచ్చు. ఉద్యోగం గానీ.. వ్యాపారం గానీ చెయ్యాలంటే సింగిల్ ఉన్నప్పుడే ప్రయత్నించాలి. ఒక్కసారి మీ జీవితంలోకి భాగస్వామి అడుగుపెడితే.. అవన్నీ సాధ్యం కాకపోవచ్చు.

తోడు కావాలా నాయనా?

తోడు కావాలనుకుంటే ఈ రోజుల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి విషయాల్లో మీరు కాస్త ఓపెన్‌గా ఉండండి. ఇటీవల డేటింగ్ యాప్‌లు ఉండనే ఉన్నాయ్. అందులో మీ అభిరుచికి తగిన జోడీని వెతుక్కోండి. సామాజిక కార్యక్రమాల ద్వారా కొత్త వ్యక్తులను కలిసే ప్రయత్నం చెయ్యండి. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోండి బ్రదర్.. ఏ అమ్మాయిని తనకు ఇష్టం లేకుండా ఎలాంటి ఒత్తిడి చెయ్యకూడదు. అది పాపం.. నేరం కూడా. ఆమెకు ఇష్టమైతేనే ముందడుగు వేయండి. లేదంటే వేరే కొత్త ఆప్షన్స్ ఉండనే ఉన్నాయి.

శరీరక సుఖం అవసరమే.. కానీ, అదే జీవితం కాదు

శారీరక సుఖం అనేది సహజమైన మానవ అవసరం. మీకు తోడు లేకపోయినా దాన్ని సురక్షితంగా, ఆరోగ్యకరంగా కోరికలను తీర్చుకోడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది స్వీయ-సంతృప్తి (హస్త ప్రయోగం). దీనికి ఎవరి తోడు అవసరం లేదని మీకు తెలిసిందే. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే సహజ, సురక్షిత మార్గం. దీని గురించి సిగ్గుపడొద్దు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కూడా. కానీ, దీన్ని అందరికీ చెప్పుకోకూడదు. అలాగే శుభ్రత కూడా అవసరం.

Also Read: ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చినదైనా.. వివాహానికి ముందు ఈ 5 వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించండి

ఇలా కూడా సంతోషం.. సంతృప్తి పొందవచ్చు

సంతోషాన్ని అందించే ఎండార్ఫిన్లు కేవలం శారీరక సుఖం ద్వారా మాత్రమే వస్తాయి అనుకుంటే పొరపాటే. యోగా, వ్యాయామం.. ఇతర శారీరక కార్యకలాపాల ద్వారా కూడా ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి మీలో ఆనందాన్ని ప్రేరేపిస్తాయి. మంచి ఆహారం, తగిన నిద్ర కూడా మీ మానసిక సంతృప్తికి దోహదం చేస్తాయి. శారీరక సుఖం కోసం అతిగా ఆలోచించడం ఒత్తిడిని కలిగిస్తుంది. ఒకవేళ ఈ అవసరాలు మిమ్మల్ని బాధిస్తుంటే, సెక్సాలజిస్ట్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడితే మంచిది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×