Sanjay Dutt: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా, నిజ జీవితంలో కూడా మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది హీరోలు నిజజీవితంలో కూడా హీరోలు అనిపించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి గొప్ప మనసును బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) చాటుకున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. తమ అభిమానులు కోసం ఏం చేయడానికి అయినా వెనకాడరు. ఈ క్రమంలోనే సంజయ్ దత్ అభిమాని ఏకంగా తన ఆస్తిని మొత్తం హీరో పేరు మీద రాసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఘటన గురించి సంజయ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆస్తి మొత్తం వెనక్కిచ్చిన హీరో..
ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ… తన అభిమాని నిషా పాటిల్(Nisha Patil) అనే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో తనకు ఉన్నటువంటి 72 కోట్ల రూపాయల ఆస్తిని (Rs 72 crore property )తన పేరు మీద రాసినట్టు సంజయ్ దత్ తెలిపారు. తన మరణాంతరం ఆస్తి మొత్తం తనకే దక్కేలా వీలునామా కూడా రాసినట్టు సంజయ్ దత్ తెలియజేశారు. ఇక ఆస్తి మొత్తం ఆయనకే ఇవ్వాలని బ్యాంకులకు కూడా సూచనలు చేసినట్టు ఈయన తెలియచేశారు. ఇలా అభిమాని నిషా పాటిల్ తన పేరు మీద రాసిన ఈ 72 కోట్ల రూపాయల ఆస్తిని తాను వెంటనే తన కుటుంబ సభ్యుల పేరు మీద రాసి తిరిగి వారికే ఇచ్చానని హీరో సంజయ్ దత్ తెలియచేశారు.
అభిమానానికి రుణపడి ఉంటా…
62 సంవత్సరాల నిషా పాటిల్ అని అభిమాని తనపై ఉన్న అభిమానంతోనే ఇలా ఆస్తి మొత్తం తనకు రాసిచ్చిందని ఈయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఆస్తిని తిరిగి వెనక్కి ఇవ్వడంతో సంజయ్ దత్ మంచి మనసు నిజాయితీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నా,రు. ఇక ఈమె 2018 సంవత్సరంలో మరణించినట్లు ఈయన తెలిపారు. ఆమె మరణించిన తరువాతనే ఆస్తికి సంబంధించిన వీలునామ బయటపడిందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను తన లాయర్లతో మాట్లాడి తిరిగి ఆస్తిని మొత్తం తన కుటుంబ సభ్యుల పేరు మీదనే రాసానని తెలిపారు.. ఇకపోతే ఆ మహిళ నాపట్ల చూపిన అభిమానానికి నేను కృతజ్ఞుడిని ఆమెను తాను ఒక్కసారి కూడా కలవలేదని అయినప్పటికీ ఆమె తనపై ఇంత అభిమానాన్ని చూపించినందుకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.
సౌత్ సినిమాలపై ఫోకస్…
ఇలా ఒక హీరో కోసం తన ఆస్తి మొత్తం రాసి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడే ఆ హీరో పై తనకున్న అభిమానం ఏంటో బయటపడింది. అయితే ఆ ఆస్తిని తిరిగి ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయమని చెప్పాలి. ఇక సంజయ్ దత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఇటీవల కాలంలో కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలీ సినిమాలో సంజయ్ నటించారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా ద్వారా కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
Also Read: Kingdom Story : సొంత అన్ననే చంపే స్టోరీతో కింగ్‌డం… ఈ సెంటిమెంట్ ఆడియన్స్‌కు ఎక్కుతుందా ?