BigTV English

Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు ‘ రన్ టైం ఇంతేనా..? ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్..

Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు ‘ రన్ టైం ఇంతేనా..? ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్..

Harihara Veeramallu : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. ఏపి ఎన్నికలకు ముందు ఈ సినిమాని ప్రకటించిన కూడా ఏదో ఒక అడ్డంకి వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.. ఈనెల 24న థియేటర్లలోకి విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, క్వాలిటీ పరంగా ఎక్కడా వెనకడుగు వేయకుండా నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించాడు అనే విషయం థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాతే అర్థం అయ్యింది. ఇటీవలే ఈ మూవీ బిజినెస్ కూడా మొదలైంది. ఇదిలా ఉండగా మూవీ రన్ టైం గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


‘వీరమల్లు ‘ రన్ టైం ఇంత తక్కువ…?

మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలంటే దాదాపు మూడు గంటల వరకు ఉంటాయని అందరూ అనుకుంటారు. గతంలో వచ్చిన సినిమాలు రెండు గంటలకు పైగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా మాత్రం రన్ టైం కాస్త తక్కువగానే ఉందని ప్రేక్షకుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. ఈమధ్య కాలం లో విడుదలైన ‘కుబేర’,’కన్నప్ప’ చిత్రాల రన్ టైం మూడు గంటలకు పైగా ఉంటుంది. కానీ ఈ మూవీకి తక్కువ టైం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి కేవలం 2.30 గంటలు మాత్రమే ఉందని టాక్.. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా వేగంగా ఉంటుందట. ఇది సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవ్వొచ్చు. మల్టీప్లెక్స్ షోస్ కూడా ఈ రన్ టైం కి భారీ సంఖ్యలో ప్లాన్ చేయొచ్చు.. అయితే ఇది ఒక విధంగా మంచి విషయం.. కానీ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ పట్టుకుంది..


Also Read :16 ఏళ్లకే స్టార్ స్టేటస్.. ఫ్రెండ్ భర్తతో పెళ్లి..తెలుగులో తోపు హీరోయిన్..

పవన్ కళ్యాణ్ బిజినెస్ వివరాలు..

పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నాయి. ఈ మూవీకి కూడా అలానే మంచి టాక్ తో భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు ఏరియాల వారీగా అమ్మకాలు మొదలుపెట్టారు మేకర్స్. ఆంధ్ర ఏరియాకు గాను రూ. 80 కోట్ల రేషియో చెబుతున్నారు. అలాగే తెలంగాణ నైజాం ఏరియాకు గాను రూ. 65 కోట్లకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతానికి గాను రూ. 25 కోట్లుగా డిస్ట్రిబ్యూటర్లతో బేరాలు చేస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.. థియేట్రికల్ రైట్స్ ను గట్టిగానే చెప్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ ఈ నెల 11 లోపు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం లో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి. అలాగే ప్రమోషన్స్ ను కూడా త్వరలోనే మొదలు పెడుతున్నారు..

Related News

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు

Big Stories

×