OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే ఇలాంటి సినిమాలను కంటి రెప్ప వాల్చకుండా చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఇంట్రెస్టింగ్ మూవీ. అయితే ఇందులో ఇదేం పాడు బుద్ధిరా ? అన్పించేలా ఓ ముసలాడు పక్కింట్లో కెమెరాలు పెట్టి, వాళ్ళు చేసే ప్రతీ పని చూస్తుంటాడు. మరి ఈ మూవీని మనం ఎక్కడ చూడవచ్చు? అనే వివరాల్లోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ’13 Cameras’. 2015 లో వచ్చిన ఈ సినిమాకి విక్టర్ జార్కాఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో నెవిల్లె ఆర్చంబాల్ట్ (జెరాల్డ్), బ్రియాన్ మోన్‌క్రీఫ్ (క్లైర్), పీజే మెక్‌కేబ్ (ర్యాన్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఒక సర్వైలెన్స్ థీమ్ తో తెరకెక్కింది. Amazon prime video, YouTube, Apple TV లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ర్యాన్, క్లైర్ అనే కొత్తగా పెళ్ళైన ఒక జంట, న్యూయార్క్ నుండి కాలిఫోర్నియాకు వెళ్తారు. క్లైర్ ఇప్పుడు గర్భవతిగా ఉంటుంది. వీళ్ళు అక్కడ ఒక సబర్బన్ రాంచ్-స్టైల్ ఇంటిని అద్దెకు తీసుకుంటారు. దీని యజమాని అయిన జెరాల్డ్ ప్రవర్తన అనుమానస్పదంగా ఉంటుంది. వీళ్ళు అతన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇంటిలో స్థిరపడతారు. జెరాల్డ్ ఇంటిలో 13 కెమెరాలను రహస్యంగా అమర్చి ఉంటాడు. బెడ్‌రూమ్, బాత్‌రూమ్, షవర్, కిచెన్, స్విమ్మింగ్ పూల్, చివరికి టాయిలెట్ బౌల్‌లో కూడా ఒక కెమెరాను ఫిక్స్ చేస్తాడు. అతను తన అపార్ట్‌మెంట్ నుండి, ఈ కెమెరాల ద్వారా ర్యాన్, క్లైర్ ప్రతి కదలికను గమనిస్తాడు. వీళ్ళ వీడియోలను రికార్డ్ చేస్తూ, రీప్లే చేసి చూస్తుంటాడు. ఇలా వీటిని చూస్తూ అతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. అతను ర్యాన్, క్లైర్ ఇంటిలో లేనప్పుడు దొంగచాటున చొరబడి, వారి వస్తువులను (టూత్‌బ్రష్‌ను నోటిలో పెట్టుకోవడం, వారి బట్టలను తాకడం) లాంటి పనులు చేస్తుంటాడు. కానీ ర్యాన్, క్లైర్ ఇతని గురించి ఏమాత్రం అనుమానం రాదు.
ఈ క్రమంలో క్లైర్ వివాహ బంధంలో సమస్యలు మొదలవుతాయి. క్లైర్ గర్భవతిగా ఉండటం వల్ల, ర్యాన్ తన భార్యతో కాకుండా తన కొత్త అసిస్టెంట్ హన్నాతో సన్నిహితంగా ఉంటాడు. క్లైర్ ఇంట్లో లేనప్పుడు అతను హన్నాను ఇంటికి తీసుకొస్తాడు. జెరాల్డ్ ఈ సీన్స్ తన కెమెరాల ద్వారా గమనిస్తాడు. అదే సమయంలో, జెరాల్డ్ ఇంటిలో ఒక రహస్య బేస్‌మెంట్‌ను సౌండ్‌ప్రూఫ్ చేయడం ప్రారంభిస్తాడు. ఒక రోజు హన్నా ర్యాన్‌ను క్లైర్‌ను వదిలేయమని ఒత్తిడి చేస్తుంది. అతను తన భార్య గర్భవతిగా ఉన్న విషయాన్ని హన్నాకు చెప్పకుండా దాచిపెడతాడు.
Read Also : 14 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్… ట్యూషన్ టీచర్ పాడు పనులు… దిమ్మ తిరిగే ట్విస్టులున్న కోర్టు రూమ్ డ్రామా
ఒక రోజు, హన్నా ఇంటికి వచ్చినప్పుడు క్లైర్ గర్భవతిగా ఉన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇది ఆమెకు బాగా కోపం తెప్పిస్తుంది. ఆమె అతనిపై తిరగబడటంతో, ర్యాన్ కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత జెరాల్డ్ హన్నాను బేస్‌మెంట్‌లోని సౌండ్‌ప్రూఫ్ రూమ్‌లో బంధిస్తాడు. ర్యాన్ వ్యవహారం గురించి తెలుసుకుని, అతన్ని ఇంటి నుండి క్లైర్ బయటికి గెంటేస్తుంది. కానీ ఇంతలోనే ఆమె ఒక కెమెరాను గుర్తించి అతన్ని మళ్ళీ పిలిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ ఊహించని టర్న్ తీసుకుంటుంది. చివరికి ఈ జంటకి కెమెరాలు పెట్టింది ఎవరో తెలుస్తుందా ? జెరాల్డ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? హన్నా ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీలో చూడకూడాని సీన్స్ చాలా ఉంటాయి జాగ్రత్త.