Star Heroine: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న కొందరు మొదట సీరియల్స్లలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకొని ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో ఎంతోమంది పాన్ ఇండియా హీరోయిన్లుగా కూడా మారారు. ఇండస్ట్రీలో యంగ్, స్టార్ హీరోలతో నటించి ఫేమస్ అయింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన మొదటి సినిమాతోనె కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఆమె ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు.. ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ ను మరోవైపు సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఆమె ఎవరో గుర్తు పట్టారా..? అవును ఆవిడే.. కాస్త వివరంగా చూస్తే…
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి అందరికీ తెలుసు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, టాలీవుడ్ అలాగే తమిళ చిత్రాల్లో నటించి అతి చిన్న వయసులోనే ప్రశంసలు అందుకుంది. 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా మారింది. హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.. 2007 లో పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకు పోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
Also Read : బిగ్ బాస్ తర్వాత నా పరిస్థితి దారుణం.. ఆశ పడ్డాను జరగలేదు..
ఫ్రెండ్ మాజీ భర్తతో వివాహం..
కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.. 2022 డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్ లో ముండోటా ఫోర్ట్ ప్యాలస్ లో తన సొంత స్నేహితురాలు మాజీ భర్తనే సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె వరసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం భర్త తో కలిసి బిజినెస్ రంగంలో కూడా బిజీగా ఉంది హన్సిక. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఒకవైపు సినిమాలు మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఆపిల్ బ్యూటీ బిజీగా గడుపుతుంది. తెలుగులో సినిమాల తో మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.. ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికొస్తే.. తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగోడుతుంది.. ఇటీవల హన్సిక ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి అయితే దానిపై ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు.