AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో వచ్చిన పుష్ప(Pushpa ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు బన్నీ. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డు అందుకొని టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడిగా రికార్డు సృష్టించారు. ఈ సినిమా తర్వాత పుష్ప 2(Pushpa 2) సినిమా చేసి మరొకసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించారు. అలా ఈ సినిమాతో దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించారు అల్లు అర్జున్.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోతున్న AA22xA6..
ఇదిలా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన వీఎఫ్ఎక్స్ కంపెనీలతో పని చేయబోతున్నట్లు చూపించి ,సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రముఖ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi maran) అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అటు ప్రేక్షకులలోనూ.. ఇటు వ్యాపార వర్గాలలోనూ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అల్లు అర్జున్ మూవీలో అడుగుపెట్టబోతున్న కోలీవుడ్ స్టార్..
అందులో భాగంగానే రోజుకొక వార్త ఈ సినిమా నుంచి వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు మరొక వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సందడి చేయబోతున్నారట. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం.. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. అసలే విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న విజయ సేతుపతి ఇప్పుడు బన్నీ మూవీలో భాగమైతే కచ్చితంగా ఈ సినిమా మరో ఫీట్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు
బన్నీ సరసన ముగ్గురు స్టార్ హీరోయిన్స్..
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్లు నటిస్తారని వార్తలు రాగా.. ఇప్పటికే దీపికా పదుకొనే (Deepika Padukone) పేరు హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించారు. అటు రష్మిక మందన్న(Rashmika Mandanna), మృణాల్ ఠాగూర్ (Mrunhal Thakur), జాన్వీ కపూర్ (Janhvi kapoor)పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రష్మిక హీరోయిన్ గా కాకుండా విలన్ గా నటించబోతుందని.. మిగతా ముగ్గురు హీరోయిన్ లుగా నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై కూడా అధికారిక ప్రకటన రానుంది. మరొకవైపు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. అలా సినిమాలలో నటించే నటీనటుల గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి ఎవరిని ఈ సినిమాలో ఫైనల్ గా తీసుకోబోతున్నారు అనే విషయంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.
also read: Tollywood: అత్యంత దారుణ పరిస్థితిలో వెంకీ మూవీ కమెడియన్..బెడ్ పై నడవలేని స్థితిలో!