Thalapathy Vijay: చాలామంది సినిమా ప్రేమికులు ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు మన వైపు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అంతే కాకుండా మరికొంతమంది సినిమాల్లో రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే కెరియర్ పీక్ లో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు. పార్టీలు స్థాపించిన వెంటనే తాను పోటీ చేయకుండా వేరే పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత సొంత పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ పార్టీకి సరైన ఆదరణ లభించలేదు.
అయినా పోరాటం ఆపకుండా దాదాపు పది సంవత్సరాలు పాటు కష్టపడుతూనే ఉన్నారు. పదవి లేకపోయినా కూడా కొన్ని విషయాలను ప్రశ్నించిన తీరు చాలామందిని ఆకట్టుతుంది. మొత్తానికి 2024 లో 21 సీట్లను పోటీ చేస్తే 21 సీట్లు గెలిచాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా సేవలందిస్తున్నారు. మరోవైపు తమిళ్ రాజకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. తలపతి విజయ్ తమిళ వెట్రి కలగం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే
ప్రాణం తీసిన జెండా
తమిళ రాజకీయాల్లో విజయ్ చాలా బిజీగా ఉన్నారు. విజయ్ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో కొంత మార్పునైతే విజయ్ తీసుకొస్తాడు అని చాలామందికి అనిపిస్తుంది. ఈ తరుణంలో అనుకోకుండా ఒక ఊహించిన సంఘటన జరిగింది. హీరో విజయ్ టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు మృతి చెందారు.
మదురైలో 100 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన హీరో విజయ్ కి చెందిన టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి నుజ్జునుజ్జయిన కారు.. ఒకరు మృతి, జనం భయంతో పరుగులు తీసారు. ప్రజాసేవ కోసం చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అని ఇలా అనుకోని సంఘటన వలన వ్యక్తి చనిపోతే ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు అని చెప్పాలి. విపరీతమైన విమర్శలు వస్తాయి.
టార్గెట్ చేయడం మొదలుపెడతారు
ఏ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయిన కూడా, అవతల పార్టీ వ్యక్తులు దానిని అవకాశం గా తీసుకొని టార్గెట్ చేస్తారు. ప్రస్తుతం విజయ్ కు కూడా అదే ఎదురవుతుంది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా విజయ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. విజయ్ విషయానికి వస్తే ఒకవైపు రాజకీయాల్లోనూ మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ కంప్లీట్ గా సినిమాలకు దూరం ఉంటాడు అని తమిళ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read : Kanyakumari trailer : డేటింగ్ లు లేవు అంతా బ్యాటింగ్ లే, కన్యాకుమారి ట్రైలర్