Comedian Ramachandra: మాస్ మహారాజా రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘వెంకీ’ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి..ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ సన్నివేశంలో వచ్చే కామెడీ అలాగే రవితేజ ఫ్రెండ్స్ గ్రూపు చేసే అల్లరి సినిమాకు హైలైట్ గా నిలిచింది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో వచ్చినా ఆడియన్స్ అతుక్కుపోతారు అనడంలో సందేహం లేదు. అంతలా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రవితేజ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకరైన ఒక కమెడియన్.. మనల్ని కడుపుబ్బా నవ్వించి, ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఆయన్ని చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరి ఆ కమెడియన్ ఎవరు? ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అత్యంత దారుణ పరిస్థితిలో స్టార్ కమరియన్..
వెంకీ సినిమాలో రవితేజతో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్లో కమెడియన్ రామచంద్ర (Ramachandra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమాలో తన కామెడీతో అందరిని నవ్వించారు. ఆ తర్వాత ‘గౌతం ఎస్.ఎస్.సీ’ సినిమాలో కూడా ఈయన నటించడం జరిగింది. ముఖ్యంగా చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఇటీవల ‘డీజే టిల్లు’, ‘సర్’ చిత్రాలలో చిన్న పాత్రలు చేశారు. ఇకపోతే అలాంటి ఈయన.. గత 20 రోజుల ముందు వరకు బాగానే ఉన్నారు.. కానీ సడన్గా పక్షవాతానికి గురైనట్లు సమాచారం. ఇటీవల ఒక 20 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రామచంద్ర.. ఇప్పుడు అదే ఛానల్ వారు.. ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడగా.. తనకు పక్షవాతం వచ్చిందని, ఈ పక్షవాతం రావడానికి అసలు కారణాన్ని కూడా తెలిపారు.
పక్షవాతం వచ్చిందంటూ..
రామచంద్ర మాట్లాడుతూ.. “ఒక 15 రోజుల క్రితం నేను నా ఫ్రెండ్ కోసం చిన్న డెమో షాట్ ఉంటే వెళ్లాను. అక్కడికి వెళ్ళాక సడన్ గా కాళ్లు, చేతులు లాగేయడం జరిగింది. నాకు హెల్త్ బాలేదు అని చెప్పి షూట్ నుంచి వచ్చేసాను. రెండు రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కాన్ చేస్తే పెరాలసిస్ అని చెప్పారు. అప్పటికే అది అటాక్ అయిందట. బ్రెయిన్ లో మొదట ఒక క్లాట్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ మొత్తం పనిచేయడం ఆగిపోయాయి. బ్రెయిన్ లో క్లాట్స్ పోతే ఇది పోతుందని చెప్పారు. ప్రస్తుతానికి మందులు ఇచ్చారు వాడుతున్నాను” అంటూ తన దీన పరిస్థితిని చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు రామచంద్ర.
నడవలేని పరిస్థితిలో..
ప్రస్తుతం నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితం అవడంతో ఆయనను చూసిన అభిమానులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. త్వరగా చికిత్స తీసుకొని కోలుకోవాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఒక గొప్ప నటుడు ఇలా పక్షవాతానికి గురై మంచాన పడటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
also read: Handloom Handicrafts Expo: ఘనంగా దస్త్కారి హాథ్ హ్యాండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో.. ఎక్కడంటే?