Intinti Ramayanam Today Episode August 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి నన్ను అసలు పట్టించుకోకుండానే పడుకున్నావు. అసలు ఉన్నావా లేదా అని కూడా నువ్వు ఆలోచిస్తున్నావా అని కమల్ ని అడుగుతుంది. ఇంట్లోని వాళ్ల గురించి వాళ్ళ సమస్యల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా..? జరుగు నేను బెడ్ మీద పడుకుంటాను అంటే.. నువ్వు ఈ రూమ్ లో పడుకోవాలంటే నేల మీద పడుకోవాలి అని అంటాడు. పల్లవి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అని అంటుంది.
అక్షయ్ అవని దగ్గర్నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఆరాధ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది.. అయితే బయటికి వెళ్లిపోతున్న అక్షయ్ ని చూసి ఏమైంది ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది.. నేను మీ అమ్మ దగ్గర ఉండలేనమ్మ ఏదిరి ఇంట్లోనే ఉంటాను కదా ఎప్పుడు కాబట్టి అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి చూడొచ్చు అని అంటాడు. అక్షయ్ అలా వెళ్ళగానే ఆరాధ్య కూడా బ్యాగ్ ఇంట్లో వేసి బయటకు వెళ్ళిపోతుంది.. ఆరాధ్య కోసం అవని అక్షయ్ మళ్ళీ ఒకే ఇంట్లోకి వచ్చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు.. అయినా వీడు రానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చాడు అని అడుగుతాడు.. ఆరాధ్యను ఏమి చెప్పద్దని అవని చెప్పడంతో ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లల మనసుని మీరు అర్థం చేసుకోవాలి అని అవని అక్షయకి క్లాస్ పీకుతుంది.. రాజేంద్ర ప్రసాద్ కు జరిగిన విషయాన్ని అవని చెప్తుంది.. పార్వతి గుడికి వెళ్లి అక్కడ తన భర్త ఫ్రెండ్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంది.
ఏమైనా అన్నయ్యగారు మీరు ఇంత బాధపడుతున్నారు ఏంటి అని అడుగుతుంది. అయితే ఆయన చెప్పిన విషయాన్ని విని షాక్ అవుతుంది. నా కూతురు గొప్పగా ఉండాలని గొప్పింటి సంబంధం అంటూ నేనే బలవంతంగా ఒక సంబంధాన్ని తీసుకొచ్చి నా కూతురికి చేశాను. కట్నం ఇచ్చాను. అయితే వాడు నా కూతురు ఇంటికెళ్లిన రెండు రోజులకే కట్నం తీసుకొని బయటికి గెంటేశారు. వాడికి ఆల్రెడీ ఎన్నో పెళ్లిళ్లు కూడా అయినట్లు తెలిసింది. మీరు కూడా మీ ప్రణతికి పెళ్లి చేసే ముందు ఇలాంటివన్నీ ఆలోచించి చేసుకోండి అని సలహాలు ఇస్తారు.
పార్వతి అవని చేసిన మంచి గురించి తలుచుకొని బాధపడుతుంది. అవని నా కూతురు జీవితాన్ని నిజంగా కాపాడింది అంటూ అనుకుంటుంది. అయితే నా విషయంలో ఎందుకు తప్పు చేసిందని ఆలోచిస్తుంది. ఏది ఏమైనా కూడా దేవుడు అవని రూపంలో వచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడాడు అంటూ అనుకుంటుంది. ఇక పల్లవి తన ప్లాన్ ఫెయిల్ అయిన విషయాన్ని తన తండ్రికి చెప్తుంది. భరత్ ఇలా మాట్లాడటం ప్రణతి ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చడం లేదు డాడి అని పల్లవి అంటుంది.
భరత్ ని అవమానించాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా.. ప్రణతి నాకే ఎదుగు సమాధానం చెబుతూ నన్ను ఎదిరిస్తుంది డాడీ అని చెప్తుంది. అవని ఈ దగ్గర ఎన్ని రోజులు ఉంది కదా అవన్నీ చెప్పినట్లే వింటుంది. అవని లాగే ప్రవర్తిస్తుంది అని చక్రధర్ అంటాడు. మీ అత్తయ్య తన కూతురు జీవితం బాగుండాలని ఒక అమ్మగా ఆలోచించి ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు ప్రణతి గురించి దాని మొగుడు గురించి తప్పుగా అంటే నీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంది ఇది గుర్తించు అని వాళ్ళ డాడ్ పల్లవికి చెప్తాడు.
అవని కాఫీ చేసి అందరికీ ఇస్తుంది. కానీ తన చేత్తో ఇస్తే అక్షయ్ తీసుకోడని స్వరాజ్యం చేత పంపిస్తుంది.. ఆ కాఫీ తాగగానే అక్షయ్ పాస్టులోకి వెళ్ళిపోతాడు. కాఫీ చాలా బాగుందండి అని మెచ్చుకుంటాడు కానీ స్వరాజ్యం మాత్రం అవని చేసి పంపించింది అని అంటుంది. ఆరాధ్య కోసం నేను ఇక్కడ ఉంటున్నాను కానీ అవ్వని కోసం నేను ఉండట్లేదు అని అనుకుంటాడు. ఇక ఆరాధ్య స్కూల్ యూనిఫామ్ ని ఐరన్ చేయమని చెప్తే చేస్తానమ్మా మర్చిపోయానని అవని అంటుంది. లేదమ్మా నేను నాన్నతో చేయించుకుంటానని ఆరాధ్య అక్షయ దగ్గరికి వెళ్తుంది.
అవని నా చేత పనులను చేయిస్తుందని అనుకుంటాడు.. నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తానని ఐరన్ చేయడానికి వెళ్తాడు కానీ అక్కడ యూనిఫామ్ని కాల్చేస్తాడు. చూశారా ఎవరే పని చేయాలో ఆ పని చేయాలి లేకుంటే ఇలానే జరుగుతుందని అవని అంటుంది. స్కూల్ యూనిఫాం పోతే డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కోవచ్చు జీవితాల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలని రాజేంద్రప్రసాద్ కూడా క్లాస్ పీకుతాడు.
Also Read : బాలును మార్చుకోవడం కోసం మీనా ప్రయత్నం.. షాకిచ్చిన ప్రభావతి..అయ్యో పాపం..
భరత్ తనకి జరుగుతున్న అవమానాలని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ప్రణతి వచ్చి ఇది నీళ్లు అందరు నీవాళ్లు.. మీవాళ్లు అంటే నువ్వు బాధపడకూడదు కదా అని అంటుంది. మనకు ఇంకా శోభనం గురించి ఏర్పాట్లు చేయలేదని నువ్వు ఆలోచిస్తున్నావా? మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది కదా ఖచ్చితంగా చేస్తుందిలే అని అంటుంది. ఆ విషయాన్ని పార్వతి వింటుంది. ఇక కమల్ పల్లవికి షాక్ ఇవ్వాలని కరెంట్ షాక్ పెట్టబోతాడు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పార్వతి అవని కలిసి పోయిందని పల్లవి ఫీలైపోతుంది… ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…