Kollywood : ఇటీవల కాలంలో ఎంతోమంది సీనియర్ యాక్టర్స్ చనిపోయారు.. ఇప్పటికే ఎంతోమంది అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. ఇండస్ట్రీలో ప్రముఖులుగా కొనసాగుతున్న ఎంతోమంది నటీనటులు మరణించారు.. తాజాగా మరో దిగ్గజ నటుడును సినీ ఇండస్ట్రీ కోల్పోయింది.. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు, దర్శకుడు కే. భాగ్యరాజ్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుండెపోటుతో కిందపడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. డైరెక్టర్ గా, నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గొప్ప నటుడు చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో పాటుగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు.. తమిళ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు కన్నుమూయడంతో పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు.. నేడు సాయంత్రం ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నట్లు వార్తలు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.. పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి..
తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న నటుల్లో కే. భాగ్యరాజ్ ఒకరు.. ఎన్నో వందల సినిమాలలో నటించి ప్రేక్షకులు మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు, దర్శకుడు అయిన ఈయన ఇకలేరు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన భాగ్యరాజ్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.. తన నివాసంలో గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పటల్లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. తమిళ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది అన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో విషాదఛాయలను మిగిల్చింది. ఆయన మరణ వార్త విన్న పలువురు అభిమానులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని తన నివాసంలో ఉంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. నేడు సాయంత్రం చెన్నైలోని మహాప్రస్థానంలో భాగ్యరాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నట్లు కోలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో పాటుగా రాజకీయ నేతలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అయిన తెలుగులో కూడా పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నటుడు, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భాగ్యరాజ్ తమిళ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగారు.. ఈయన 75 కు పైగా చిత్రాల్లో నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను ‘వన్ మ్యాన్ స్టూడియో’గా అభివర్ణించేవారు.. ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు.. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన పెళ్లైంది కానీ’ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్ ను అందించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా రచన, దర్శకత్వం వహించారు.ఉత్తమనటుడుగా ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఇక ఈయన కుటుంబం విషయానికొస్తే.. నటి పూర్ణిమ భాగ్యరాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి శరణ్య భాగ్యరాజ్, శంతను భాగ్యరాజ్ ఇద్దరు సంతానం.