E-Paper
Advertisement

ఆఫీస్ లైఫ్ – పర్సనల్ లైఫ్‌ను వేరు చేసే వింత ప్రయోగం… బెస్ట్ సైకలాజికల్ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్

ఆఫీస్ లైఫ్ – పర్సనల్ లైఫ్‌ను వేరు చేసే వింత ప్రయోగం… బెస్ట్ సైకలాజికల్ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Thriller Series : కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మంచి జీతంతో పాటు జీవితం కూడా హాయిగా సాగుతుంది. కానీ ఈ కార్పొరేట్ కంపెనీలో మాత్రం విచిత్రంగా ఎంప్లాయిస్ చిప్పులు దొబ్బేస్తూ ఉంటారు. ‘సెవెరెన్స్’ (Severance) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ 2022లో విడుదలైంది. ప్రస్తుతం ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+)లో అందుబాటు ఉంది. ఈ మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ కు బెన్ స్టిల్లర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆఫీస్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య ఉండే సమతుల్యతను ఒక వింతైన సైన్స్ ప్రయోగం ద్వారా అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు.

కథలోకి వెళ్తే…

లూమన్ ఇండస్ట్రీస్ అనే సీక్రెట్ మల్టీ నేషనల్ సంస్థ ఒక వింత చట్టాన్ని అమలు చేస్తుంది. దాని పేరే ‘సెవెరెన్స్’. ఈ పద్ధతి ప్రకారం ఉద్యోగి మెదడులో ఒక చిన్న మైక్రోచిప్‌ను సర్జరీ ద్వారా అమరుస్తారు. దీనివల్ల ఉద్యోగి ఆఫీస్ లోపలికి వెళ్లగానే తన వ్యక్తిగత జీవితం… అంటే భార్య, పిల్లలు, గతం వంటివి పూర్తిగా మర్చిపోతాడు. మళ్లీ ఆఫీస్ దాటి బయటకు రాగానే ఆఫీస్ లోపల ఏం జరిగిందో అంతా మర్చిపోతాడు. దీనివల్ల ఒకే మనిషిలో ఇద్దరు వ్యక్తులు తయారవుతారు.

Advertisement

ఆఫీస్ బయట ఉండే అసలైన వ్యక్తిని అవుటీ,.ఆఫీస్ లోపల మాత్రమే బతికే వ్యక్తిని ఇన్నీ అని పిలుస్తారు. వీరికి బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. మార్క్ స్కౌట్మార్క్ అనే వ్యక్తి ఇందులో మన హీరో. తన భార్య మరణించిన బాధ నుండి తట్టుకోలేక, రోజులో కనీసం 8 గంటలైనా ఆ బాధను మర్చిపోవచ్చనే ఉద్దేశంతో లూమన్ సంస్థలో ఉద్యోగంలో చేరి ‘సెవెరెన్స్’ చేయించుకుంటాడు. ఆఫీస్ లోపల ఉండే అతని ‘ఇన్నీ’ పాత్రకు తను ఎందుకు ఏడుస్తున్నాడో, బయట తన జీవితం ఏంటో అస్సలు తెలియదు.

అతను మైక్రోడేటా రిఫైన్‌మెంట్ అనే విభాగంలో కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చే కొన్ని వింత నంబర్లను వేరు చేసే పని చేస్తుంటాడు. కథలోకి హెల్లీ (బ్రిట్ లోవర్) అనే కొత్త ఉద్యోగిని ప్రవేశించడంతో కొత్త మలుపు తిరుగుతుంది. ఆఫీస్ లోపల బందీగా ఉన్న భావనతో ఆమె అక్కడి నుండి పారిపోవడానికి ఆత్మహత్యాయత్నం కూడా చేస్తుంది. కానీ బయట ఉన్న ఆమె ‘అవుటీ’ పాత్ర మాత్రం ఉద్యోగం మానడానికి ఒప్పుకోదు. ఇదే సమయంలో, మార్క్ పాత బాస్ పీటీ ఆఫీస్ నుండి అదృశ్యమయ్యాక, బయటి ప్రపంచంలో మార్క్‌ను కలిసి లూమన్ సంస్థ చేస్తున్న ఘోరాల గురించి చెబుతాడు.

Advertisement

దాంతో ఆఫీస్ లోపల ఉన్న మార్క్ ‘ఇన్నీ’, అతని సహోద్యోగులు కలిసి అసలు తమ సంస్థ ఏం చేస్తోంది? బయటి ప్రపంచంలో తాము ఎవరు ? అనే నిజాలను తెలుసుకోవడానికి లూమన్ నియమాలను ఉల్లంఘించి రహస్యంగా దర్యాప్తు మొదలు పెడతారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది? ఆ సంస్థ చేస్తున్న దూరగతాలు ఏంటి ? మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Read Also : 19 రోజుల తర్వాత తిరిగొచ్చే అన్నయ్య… కట్ చేస్తే గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×