E-Paper
Advertisement

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?
Advertisement

Naga Durga:సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ విషయం ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరెవరు ప్రేమలో పడతారో? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? కూడా తెలియని పరిస్థితి. అంతేకాదు సవ్యంగా కాపురాలు చేసుకుంటున్న ఎన్నో జంటలు అనూహ్యంగా విడిపోతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇకపోతే సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన తర్వాత నటీనటులు ఎక్కడైనా జంటగా కనిపిస్తే చాలు వారి మధ్య లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ వారి మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పిస్తూ ఉంటారు

రాజు వెడ్స్ రాంబాయి హీరోతో గుడిలో కనిపించిన నాగ దుర్గ

ఇకపోతే ప్రముఖ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ తాజాగా ఒక యంగ్ హీరోతో కలిసి పూజలు జరిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. విషయంలోకి వెళ్తే ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ (Akhil Raj), సింగర్ , డాన్సర్ నాగదుర్గ కలిసి సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆలయం ఆవరణలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వీరిద్దరూ ఇలా కలిసి గుడికి రావడం ఒక ఎత్తు అయితే.. ఇద్దరు కలసి పూజలు చేయించడం మరో ఎత్తు.. అయితే ఎందుకు వీరిద్దరూ కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కొంపతీసి వీరిద్దరూ ప్రేమలో పడ్డారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే?

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ నేటివిటీతో రాబోతున్న ఒక క్రేజీ ప్రైవేట్ ఫోక్ సాంగ్ కోసం వీళ్లిద్దరూ ఇలా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది వీరిద్దరూ సాధారణ దర్శనం, ప్రత్యేక పూజలు కోసమే కొమురవెల్లికి వెళ్లారు అంటూ.. అంతకుముందే వీళ్ళిద్దరూ మంచి స్నేహితుల అయ్యుండొచ్చు అని కూడా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ కలసి కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

also read:ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

ఫోక్ సింగర్ నుండి హీరోయిన్ గా..

Advertisement

నాగదుర్గ విషయానికి వస్తే.. తెలంగాణ ఫోక్ సాంగ్ లతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఈ మధ్యనే తమిళ్ లో లవ్ ఓ లవ్ సినిమాతో మెప్పించిన ఈమె తెలుగులో ఇడుపు కాయితం అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. మరి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

కొత్త సినిమాతో భారీ పాపులారిటీ..

ఇక రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఫేమ్ అఖిల్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో తన అద్భుతమైన నటనను కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇకపోతే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన..ఆ తర్వాత ఒక డెలివరీ బాయ్ పై దాడికి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఆ తర్వాత అఖిల్ స్పందిస్తూ తన తల్లిని ఆ డెలివరీ బాయ్ బండబూతులు తిట్టాడని , ఆ కోపంతోనే అలా ప్రవర్తించాను అంటూ క్లారిటీ ఇచ్చిన విషయం తెలుస్తుంది

Related News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

Big Stories

Advertisement
×